గ్రామాల్లో దాదాపు ప్రతి ఒక్కరి ఇంటి పెరట్లో మందారం చెట్టు ఉంటుంది.మందార పువ్వులను చాలా మంది రోజు పూజకు వాడుతుంటారు.
అలాగే కొందరు జుట్టు సంరక్షణకు కూడా మందారం పువ్వులను విరివిరిగా వినియోగిస్తుంటారు.అయితే అలంకరణకు మరియు జుట్టు సంరక్షణకు మాత్రమే కాదు చర్మ సౌందర్యాన్ని( Skin beauty ) పెంచడానికి కూడా మందారం పువ్వులు సహాయపడతాయి.
మందారం పువ్వుల్లో విటమిన్ సి, విటమిన్ ఈ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి.ఇవి మన చర్మానికి ఎంతో మేలు చేస్తాయి.

ముఖ్యంగా మొటిమలను( Acne ) మాయం చేసే సామర్థ్యం మందిరానికి ఉంది.ఇప్పుడు చెప్పబోయే విధంగా మందారం పువ్వులను వాడితే వారం రోజుల్లో క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల మందారం పొడి ( Hibiscus powder )వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి,( Multani soil ) చిటికెడు పసుపు, వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ ( Aloe Vera Gel )వేసుకోవాలి.
చివరిగా సరిపడా రోజ్ వాటర్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.అనంతరం వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.రోజుకి ఒక్కసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే మొటిమలు ఎంత తీవ్రంగా ఉన్నా సరే చాలా వేగంగా తగు ముఖం పడతాయి.
మొటిమల తాలూకు మచ్చలు సైతం మాయం అవుతాయి.అలాగే ఈ మందారం ఫేస్ ప్యాక్ మీ చర్మాన్ని తెల్లగా మారుస్తుంది.గ్లోయింగ్ గా మెరిపిస్తుంది.స్మూత్ గా సైతం తయారవుతుంది.
కాబట్టి మొటిమలు, మచ్చలు లేని క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ ను కోరుకునే వారు తప్పకుండా ఈ వండర్ ఫుల్ హోమ్ రెమెడీని ప్రయత్నించండి.