బాదం పాలు ఎంత రుచిగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.చాలా మంది పాల కంటే బాదం పాలనే ఇష్టంగా తాగుతుంటారు.
పైగా బాదం పాలలో మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, కాపర్, పొటాషియం, విటమిన్ బి, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్ ఇలా బోలెడన్ని పోషకాలు ఉంటాయి.అందుకే బాదం పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
ఎన్నో జబ్బులను సైతం నివారిస్తాయి.అయితే బాదం పాల వల్ల ఆరోగ్య లాభాలే కాదు.
నష్టాలు ఉన్నాయని మీకు తెలుసా.? అవును, పరిమితికి మించి బాదం పాలను తీసుకుంటే.అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.అవేంటో లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
బాదం పాలు రుచిగా ఉన్నాయనో లేదా ఆరోగ్యానికి మంచిదనో అతిగా తీసుకుంటే.రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి మధుమేహం బారిన పడే ప్రమాదం ఉంటుంది.
ఒక వేళ అప్పటికే మధుమేహం ఉంటే.షుగర్ లెవల్స్ మరింత రెట్టింపు అయిపోతాయి.
దాంతో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

బాదం పాలను ఓవర్ తీసుకుంటే.మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడతాయి.మరియు ఇతర కిడ్నీ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది.అలాగే బాదం పాలను పరిమితికి మించి తీసుకుంటే .ఆ ప్రభావం జీర్ణ వ్యవస్థపై సైతం పడుతుంది.ఫలితంగా మలబద్ధకం, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, ఎసిడిటీ, అజీర్తి తదితర సమస్యలు తలెత్తుతాయి.
అంతేకాదు, బాదం పాలను అతిగా తీసుకుంటే గనుక.
కొందరిలో చర్మ అలర్జీలు వస్తాయి.కొందరికి శ్వాస సంబంధిత సమస్యలు ఏర్పడతాయి.
ఇక ఆస్తమా వ్యాధితో ఇబ్బంది పడే వారు బాదం పాలను ఎక్కువగా తీసుకుంటే.వ్యాధి తీవ్రత బాగా పెరిగి పోతుంది.
దాంతో ఎన్నో ఇబ్బందులను ఫేస్ చేయాల్సి ఉంటుంది.అందుకే హెల్త్‌కు ఎంత మేలు చేసినా, ఎన్ని ప్రయోజనాలను అందించినా బాదం పాలను లిమిట్‌గా మాత్రమే తీసుకోవాలి.