సాధారణంగా చాలా మందికి మొటిమలు వచ్చి.అవి మచ్చలుగా మారుతుంటాయి.
ఆ మచ్చలు ముఖ సౌందర్యాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తారు.అందుకే ఈ మచ్చలను తొలగించుకోవడం కోసం నానా ప్రయత్నాలు చేస్తుంటారు.
రకరకాల క్రీములు, జెల్స్, సీరమ్స్, ఫేస్ మాస్క్‌లను కొనుగోలు చేసి యూస్ చేస్తుంటారు.అయితే కొందరిలో ఎన్ని వాడినా మొటిమల కారణంగా ఏర్పడిన మచ్చలు పోవు.
దాంతో ఏం చేయాలో తెలియక హాస్పటల్స్ చుట్టూ తిరుగుతుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీని ట్రై చేస్తే చాలా అంటే చాలా సులభంగా మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలను దూరం చేసుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండీ.
ప్రస్తుతం సమ్మర్ సీజన్ మొదలైన సంగతి తెలిసిందే.
ఈ సీజన్‌లో విరి విరిగా లభ్యమయ్యే పండ్లలో మామిడి ముందు వరసలో ఉంటుంది.మామిడి పండ్లు తినేందుకు రుచిగా ఉండటమే కాదు.
ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి ఎంతో మేలు చేస్తాయి.ముఖ్యంగా మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలను నివారించడంలో ఇవి గ్రేట్‌గా సహాయపడతాయి.
వీటిని ఎలా వాడాలంటే.మొదట బాగా పండిన మామిడి పండును తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఈ ముక్కలను మిక్సీ జార్‌లో వేసి మెత్తగా పేస్ట్ చేసి.జ్యూస్‌ను సపరేట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల మామిడి పండు జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ తేనె, హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఇ ఆయిల్, రెండు టేబుల్ స్పూన్ల అలోవెర జెల్ వేసుకుని అన్ని కలిసేలా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక చిన్న బాక్స్‌లో వేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే వారం రోజుల పాటు వాడుకోవచ్చు.దీనిని ఎలా యూస్ చేయాలంటే.నైట్ నిద్రించే ముందు ముఖాన్ని వాటర్‌తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
ఆపై తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఫేస్‌కు అప్లై చేసి పడుకోవాలి.ఇలా ప్రతి రోజు చేస్తే గనుక ముఖంపై ఉన్న మచ్చలన్నీ క్రమంగా తగ్గిపోతాయి.
మరియు చర్మం స్మూత్‌గా, షైనీగా కూడా మారుతుంది.