ప్రోటీన్ కొర‌త‌తో బాధ‌ప‌డుతున్నారా.. నాన్ వెజ్జే అక్క‌ర్లేదు ఇది కూడా తీసుకోవ‌చ్చు!

ప్రోటీన్ కొరత. పిల్లల్లో మరియు శాఖాహారుల్లో ఈ సమస్య ఎక్కువగా తలెత్తుతుంది.

 Best Smoothie To Get Rid Of Protein Deficiency ,    Protein  , Protein Rich Smoo-TeluguStop.com

శరీరానికి సరిపడా ప్రోటీన్ అందకపోవడం వల్ల నీరసంగా మారిపోతారు.ఎముకలు, కండరాలు బలహీనంగా తయారవుతాయి.

జుట్టు అధికంగా రాలడం, గాయాలు త్వరగా మానకపోవడం, అధిక ఆకలి.ఇలా ఎన్నో సమస్యలు తలెత్తుతుంటాయి.

అందుకే శరీరానికి అవసరం అయ్యే ప్రోటీన్ ను అందించాలి.అయితే ప్రోటీన్ ( Protein )అంటే చాలా మందికి నాన్ వెజ్ గుర్తుకొస్తుంది.

కానీ కొందరు నాన్ వెజ్ అస్సలు తినరు.మరి అలాంటి వారికి ప్రోటీన్ ఎలా అని భయపడాల్సిన అవసరం లేదు. నాన్ వెజ్ లోనే కాదు ఇతర ఆహారాల్లోనూ ప్రోటీన్ ఉంటుంది.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే స్మూతీని తీసుకుంటే మీ శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్ లభిస్తుంది.

ఆ స్మూతీ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వ‌న్ టేబుల్ స్పూన్‌ చేయా సీడ్స్ వేసి వాటర్ పోసి గంట పాటు నానబెట్టుకోవాలి.

Telugu Tips, Latest, Protein, Proteinrich-Telugu Health

ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో ఐదు ఫ్రెష్ పాలకూర ఆకులను వేసుకోవాలి.అలాగే నానబెట్టుకున్న చియా సీడ్స్, రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు,( Flax seeds ) ఒక గ్లాస్ హోమ్ మేడ్ బాదం పాలు( Almond milk ) వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.తద్వారా మన ప్రోటీన్ రిచ్ స్పినాచ్ స్మూతీ సిద్ధం అవుతుంది.

ఈ స్మూతీని ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో తీసుకుంటే ప్రోటీన్ కొరతే ఉండదు.

Telugu Tips, Latest, Protein, Proteinrich-Telugu Health

బాదం పాలు, చియా సీడ్స్, అవిసె గింజలు( Flax seeds ) మరియు పాలకూరను ప్రోటీన్ ( Spinach )పుష్కలంగా ఉంటుంది.వీటితో స్మూతీని తయారు చేసుకుని తీసుకుంటే ప్రోటీన్ కొరతకు గుడ్ బై చెప్ప‌వ‌చ్చు.పైగా ఈ స్మూతీ వెయిట్ లాస్( Weight loss ) కు సహాయపడుతుంది.

గుండెను ఆరోగ్యంగా మారుస్తుంది.జుట్టు రాలడాన్ని ఆపుతుంది.

మరియు కంటి చూపులు సైతం పెంచుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube