ఎన్నికల్లో రెబల్ అభ్యర్థులుగా నిలిచిన వారిపై టీడీపీ( TDP ) సస్పెన్షన్ వేటు వేసింది.పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ పార్టీ అధిష్టానం ఆరుగురిని సస్పెండ్ చేసింది.
అయితే అరకు నియోజకవర్గం నుంచి సివేరి అబ్రహం,( Siveri Abraham ) విజయనగరం నుంచి మీసాల గీత,( Meesala Geetha ) అమలాపురం నుంచి శ్యామ్ కుమార్, పోలవరం నుంచి సూర్యచంద్రరావు, సత్యవేడు నుంచి జడ్డా రాజశేఖర్,
ఉండి నుంచి శివరామరాజు( Sivarama Raju ) రెబల్స్ గా నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే నామినేషన్లు ఉపసంహరణ చేసుకోవాలని పార్టీ అధిష్టానం అభ్యర్థులతో బుజ్జగింపులు చేసినప్పటికీ సఫలం కాలేదు.
ఇక నామినేషన్ల ఉపసంహరణకు గడువు కూడా ముగియడంతో పార్టీ హైకమాండ్ ఆరుగురు రెబల్ అభ్యర్థులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.