వీడియో వైరల్: కేర్ టేకర్ ను చంపేయబోయిన సింహం.. చివరికి..

జంతువులలో ముఖ్యంగా అడవి జంతువులు ఎలా ప్రవర్తిస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఒక్కోసారి అడవి జంతువులు విశ్వసనీయ కాపలాదారులపై సెకన్ల వ్యవధిలోనే దాడి చేయవచ్చు.

 The Lion That Was Going To Kill The Video Viral Caretaker Finally, Viral Video,-TeluguStop.com

భయం, కోపం, పోటీ లాంటి భావోద్వేగాలు కలిగిన ఈ జంతువులు ఎప్పుడైనా ప్రాణాలు తీయవచ్చు.ఒకవేళ అడవి జంతువులను( Wild animals ) జాగ్రత్తగా చూసుకోకుంటే ఏం జరుగుతుందో తెలిపే షాకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ ఘటన ఓ జూ లో చోటుచేసుకుంది.వీడియోలో చూసినట్లయితే., జూ సిబ్బంది ఒక మగ మరియు ఆడ సింహాన్ని ఎన్‌క్లోజర్‌ లో కాపాడుతున్నారు.ఈ వీడియోలో, జూ కీపర్ మగ సింహం కళ్లలోకి చూశాడు.వెంటనే ఏమైందో ఏమో తెలియదు కానీ., క్షణంలో సింహం అతనిపై దాడి చేయడం మొదలు పెట్టింది.

సింహం సంరక్షకుడి కాలు కొరికేందుకు ప్రయత్నించింది.ఇంతలో అక్కడే ఉన్న మరో జూ ( Zoo )సంరక్షకుడు సింహాన్ని శాంతించేందుకు ప్రయత్నించాడు.

అదే సమయంలో ఆడ సింహం( lioness ) కూడా రంగంలోకి దిగింది.మగ సింహం దృష్టి మరల్చడానికి, దాని చుట్టు తిరుగుతూ ఆడ సింహం కంట్రోల్ చేసింది.అదే సమయంలో మరో గార్డు సింహాన్ని పక్కకు నెట్టేందుకు ప్రయత్నించడంతో బాధితుడు ప్రాణాలతో బయటపడ్డాడు.ఇదంతా వీడియోలో చూసిన నెటిజన్లు షాకయ్యారు.సింహం కళ్లలోకి చూస్తే రెచ్చిపోయి సవాలు విసురుతుందని కొందరు కామెంట్స్ చేసారు.రకరకాల కామెంట్స్ రావడంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.

మిలియన్ల కొద్దీ వ్యూస్ ఇప్పటి వరకు సంపాదించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube