ఏపీలో గ్లాస్ సింబల్ ( Glass Symbol )పై కన్ఫ్యూజన్ నెలకొంది.జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసు కామన్ సింబల్ గా మారడంతో రెబల్స్ కూటమికి షాక్ ఇస్తున్నారని తెలుస్తోంది.
జనసేన పార్టీ( Janasena party ) పోటీ చేయని స్థానాల్లో వేరే అభ్యర్థులకు గాజు గ్లాసు సింబల్ ను ఈసీ కేటాయించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే 16 అసెంబ్లీ స్థానాలతో పాటు మూడు ఎంపీ స్థానాల్లో ఈసీ గాజు గ్లాసును ఇతరులకు కేటాయించింది.
అలాగే బీజేపీ ఎంపీ అభ్యర్థులు బరిలో ఉన్న అనకాపల్లి, రాజమహేంద్రవరంలోనూ గ్లాస్ గుర్తు ఇతరులకు కేటాయించబడింది.ఇక నారా లోకేవ్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో కూడా ఓ అభ్యర్థికి గ్లాసు గుర్తును ఈసీ కేటాయించింది.
అదేవిధంగా ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పలువురు అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించబడింది.దీనిపై ఓట్లు చీల్చే కుట్ర జరుగుతుందంటూ కూటమి ఆరోపణలు చేస్తుండగా.నిబంధనలకు అనుగుణంగానే గాజు గ్లాసును కేటాయించామని ఈసీ తెలిపింది.







