పండ్లు.ప్రకృతి ప్రసాదించిన ఓ వరం అనడంలో ఎటువంటి సందేహం లేదు.ఆరోగ్య పరంగా అనేక ప్రయోజనాలను అందించే పండ్లకు.వివిధ రకాల జబ్బులను నివారించే సామర్థం కూడా ఉంది.అలాగే చర్మ సౌందర్యాన్ని పెంపొందించడానికీ పండ్లు అద్భుతంగా సహాయపడతాయి.ముఖ్యంగా నల్లటి వలయాల సమస్యతో నలిగిపోయే వారికి కొన్ని కొన్ని పండ్లు గ్రేట్ గా హెల్ప్ చేస్తాయి.
సాధారణంగా నల్లటి వలయాలు ఒక్కసారి వచ్చాయంటే ఓ పట్టాన పోవు.వీటిని వదిలించుకోవడం కోసం నానా ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తుంటారు.
కానీ, ఇప్పుడు చెప్పబోయే పండ్లతో చాలా సులభంగా నల్లటి వలయాలను నివారించుకోవచ్చు.మరి ఆ పండ్లు ఏంటో.
వాటిని ఎలా వాడాలో.ఇప్పుడు తెలుసుకుందాం.
పైనాపిల్ నల్లటి వలయాలను తగ్గించడానికి సూపర్‌గా సహాయపడుతుంది.తొక్క చెక్కేసిన పైనాపిల్ ముక్కలను కొన్నిటిని తీసుకుని మిక్సీ జార్ లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
ఈ పేస్ట్ నుంచి జ్యూస్‌ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ కస్తూరి పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ మరియు రెండు టేబుల్ స్పూన్ల పైనాపిల్ జ్యూస్ వేసుకుని అన్నీ కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి.
ఆపై ఈ మిశ్రమాన్ని కళ్ల చుట్టూ అప్లై చేసి ఓ అర గంట పాటు వదిలేయాలి.అనంతరం నార్మల్ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
ఇలా రోజుకు ఒక సారి చేస్తే నల్లటి వలయాలు క్రమంగా తగ్గిపోతాయి.

నారింజ పండుతోనూ నల్లటి వలయాలను వదిలించుకోవచ్చు.అందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల నారింజ పండు జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్ వేసి కలుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని దూది సాయంతో కంటి చుట్టూ పూయండి.
పూర్తిగా ఆరిన తర్వాత వాటర్‌తో శుభ్రం చేసుకోవాలి.రోజుకు రెండు సార్లు ఇలా చేసినా మంచి ఫలితం ఉంటుంది.