మీరు తాగుతున్న పాలు మంచివో, కాదో ఎలా తెలుసుకోవాలంటే..?!

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఆహార పదార్థాలను కల్తీ చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు కొందరు.ఇలాంటి వాటి నుండి ప్రజలకు ఎటువంటి అనుమానాలు రాకుండా  యూరియా, సల్ఫ్యూరిక్ యాసిడ్, కృత్రిమ రంగులు వంటివి ఉపయోగిస్తున్నారు.

 Test Milk Is Adulterated Or Not At Home, Milk, Ghee, Paneer, Adulteration , Suga-TeluguStop.com

పాలు, పాల ఉత్పత్తులలో కొన్ని రసాయనాలు ఉపయోగించి ప్యాకింగ్ చేసి కొనుగోలు చేస్తున్నారు.ఇక మనం మనం కొనుగోలు చేసే పదార్థాలు స్వచ్ఛమైనవో కాదో తెలుసుకునేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి.

ఈ పద్ధతులను పరిశీలిన చేసుకొని కల్తీ చేసిన ఉత్పత్తులకు, అనారోగ్యాలకు కాస్త దూరంగా ఉండటం మంచిది.

ఇందులో మొదటగా మనం చెక్ చేయాల్సింది పాలు.

పాలలో నీళ్ళు, గంజి పొడి, పిండి ,యూరియా వంటివి కలిపి కల్తీ చేస్తూ ఉంటారు.పాలలో పిండి గంజి పొడి కలిపి వాటిని చిక్కటి పాలు అని కొందరు అమ్ముతూంటారు.

ఇక ఈ కల్తీని గ్రహించడం ఎలా అని అనుకుంటున్నారా.? ఒక చిన్న గ్లాసులో పాలు తీసుకొని, అందులో ఒక చుక్క అయోడిన్ వేయాలి.అప్పుడు ఆ పాలు రంగు మారితే దాంట్లో పిండి లేదా గంజి పొడి కలిసినట్లు.అలాగే ఒక గ్లాసు పాలలో సొరియాసిస్ పొడి వేసి బాగా కలిపి ఐదు నిముషాలు పక్కన పెట్టాలి.

అందులో రెడ్ కలర్ లిట్మస్ పేపర్ ను ఉంచాలి.ఒకవేళ ఆ పాలలో యూరియా కలిపినట్లు అయితే లిట్మస్ పేపర్ బ్లూ కలర్ లోకి మారిపోతుంది.అలాగే ఒకవేళ పాలల్లో వనస్పతి లేదా డాల్డా కనిపెట్టడం ఎలా అని అనుకుంటున్నారా.? ఇందుకోసం ఒక గ్లాసు పాలలో కొన్ని చుక్కల హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఒక టీస్పూన్ చెక్కర కలిపితే ఆ పాలు ఎరుపు రంగులోకి మారితే ఆ పాలలో డాల్డా కలిపినట్లు.

పాలతో పాటు పాల పదార్థాలను కూడా కల్తీ చేయడం మొదలు పెట్టేసారు.సాధారణంగా పన్నీర్ చాలా మృదువుగా ఉంటుంది.పన్నీర్ కాస్త బరువు, ఒత్తిడిని తట్టుకొగలదు.ఇక పన్నీరు ఎలా కల్తీ చేస్తారు అని అనుకుంటున్నారా….? పన్నీర్ లో బేకింగ్ సోడా కలిపి కల్తీ చేస్తూ ఉంటారు.ఇక దీనిని సులువుగా పన్నీర్ ముక్కలు చేతితో తీసుకొని కాస్త సున్నితంగా ఒత్తి చూడండి ఒకవేళ అది కల్తీ అయినట్లయితే ఆ పన్నీరు చిన్న చిన్న ముక్కలుగా విడిపోతుంది.

అలా కాకుండా పన్నీర్ ముక్కలు నీటిలో ఉడకబెట్టి కాస్త చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని కలపాలి.ఏవైనా రసాయనాలు లేదా పిండి కలిపినట్లు అయితే పన్నీర్ నీలి రంగులోకి మారిపోతుంది.

ఇక పాలతో ఉత్పత్తి అయిన మరో పదార్థం నెయ్యి.ఒక గిన్నెలో ఒక టీస్పూన్ నెయ్యి తీసుకుని అందులో ఐదు మిల్లీలీటర్ల హైడ్రోక్లోరిక్ యాసిడ్ లేక సల్ఫ్యూరిక్ యాసిడ్ వేయాలి.నెయ్యి రంగు మారితే అది కల్తీ అయినట్లు.అలాగే నెయ్యిలో డాల్డా కలిపి కల్తీ చేస్తూ ఉంటారు.దీనికోసం ఒక స్పూన్ నెయ్యి లో కొన్ని చుక్కల హైడ్రోక్లోరిక్ యాసిడ్, కాస్త చెక్కర కలిపితే అది ఎరుపు రంగులోకి మారిపోతుంది.ఇలా ఎరుపు రంగులోకి మారినట్లు అయితే అందులో కలిపినట్లు మనం అర్థం చేసుకోవాలి.

ఇంకెందుకు ఆలస్యం ఇలాంటి కొన్ని చిన్న సలహాలను పాటిస్తూ పాలు, పాల పదార్థాలు స్వచ్ఛమైనవో, కాదో ఇట్లా తెలుసుకోవచ్చు.

Test Milk Is Adulterated Or Not At Home, Milk, Ghee, Paneer, Adulteration , Sugar, Litmus Paper, Colour Changes, Sarfuric Acid - Telugu Ghee, Litmus Paper, Milk, Paneer, Sarfuric Acid, Sugar

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube