శీతాకాలంలో పాత గాయాల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా..? దీనికి నివారణ ఏంటంటే..?

ఆటలు ఆడుతున్నప్పుడు లేదా శారీరక శ్రమ చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాలలో గాయాలు కావడం సర్వసాధారణమైన విషయం.అయితే చలికాలంలో ఇలాంటి పాత గాయాలకు సంబంధించిన నొప్పులు మళ్లీ తిరిగి వస్తాయి.

 Do You Know Why Old Wounds Ache In Winter? What Is The Cure For This? , Winter,-TeluguStop.com

ముఖ్యంగా కండరాల నొప్పులు( Muscle aches ), పాత గాయాల నొప్పులు వేధిస్తూ ఉంటాయి.అయితే శీతాకాలంలో పాత గాయాల నొప్పులు ఎందుకు వస్తాయి? ఈ నొప్పుల నుండి ఎలా బయటపడాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.సాధారణంగా చలికాలంలో గాలిలో తేమతో పాటు గాలి పీడం కూడా తగ్గిపోతుంది.దీని కారణంగా కండరాల్లో కీళ్లు వదులుగా అవుతాయి.దీంతో ఇంతకు ముందు గాయాలైన చోట్ల ఒత్తిడి పెరుగుతుంది.దీంతో గతంలో గాయమైన చోట నొప్పి, వాపు పెరిగిపోతుంది.

Telugu Exercise, Tips, Muscle Aches, Muscle Pain, Wounds, Stress-Telugu Health

కాబట్టి చలికాలంలో పాత గాయాలకు సంబంధించిన నొప్పి వేధించడానికి ముఖ్యమైన కారణం ఇదే.అయితే ఈ నొప్పులను ఎలా తగ్గించుకోవాలి అంటే చలికాలం వంటి నొప్పుల నుండి బయట పడేందుకు జర్కిన్స్ ధరించాలి.అలాగే గోరువెచ్చని నీటితో స్నానం చేస్తూ ఉండాలి.చలి కాలంలో వేడి నీళ్లతో స్నానం చేయడం వలన శరీరం వెచ్చగా ఉంటుంది.అలాగే ఇది మన కండరాలు, కీళ్ళను వెచ్చగా, ఫ్లెక్సిబుల్ గా ఉంచుతుంది.అంతేకాకుండా ఒత్తిడి( Stress ) తగ్గుతుంది.

దీంతో గాయాలు, నొప్పి, వాపు కూడా తగ్గిపోతుంది.నొప్పులు తగ్గాలి అంటే మసాజ్ చేయడం అలవాటు చేసుకోవాలి.

Telugu Exercise, Tips, Muscle Aches, Muscle Pain, Wounds, Stress-Telugu Health

గోరువెచ్చని నూనెతో నొప్పులు ఉన్న చోట మసాజ్ చేసుకోవాలి.ఇలా చేయడం వలన నొప్పులు కొంతవరకు తగ్గుతాయి.చలికాలంలో వ్యాయామాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.ఎందుకంటే కండరాలు, కీళ్లు బిగుతుగా మారుతాయి.కాబట్టి ఎక్కువగా స్త్రెచింగ్ వ్యాయామాలు( Exercise ) చేయాలి.అలా కాకుండా భారీ వర్కౌట్స్ చేస్తే నొప్పులు పెరిగే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

అలాగే ఆహారం విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.ఎముకల బలోపేతం అవ్వడం కోసం విటమిన్ సి ఉండే ఆహారాలను తీసుకోవాలి అలాగే పాలు, చీజ్, సోయాబీన్, బ్రొకోలీ లాంటి ఆహారం తీసుకోవడం వలన నొప్పులు తగ్గుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube