చక్కెర వ్యాధి ఉన్నవారు పుట్టగొడుగులు తినవచ్చా ..తినాలంటే..

సాధారణంగా చాలామంది ప్రజలకు పుట్టగొడుగులు తినడానికి ఉపయోగిస్తారని కూడా తెలియదు.పుట్టగొడుగుల రుచి దాదాపు మాంసం రుచి లాగే ఉంటుంది.

 Can People With Diabetes Eat Mushrooms , Diabetes ,mushrooms , Diabetes Eat Mush-TeluguStop.com

చాలామంది కాల్చిన వేయించిన పుట్టగొడుగులను ఎక్కువగా ఇష్టపడి తింటూ ఉంటారు.మరి కొంత మంది పుట్టగొడుగుల కూరను బాగా ఇష్టపడతారు.

అయితే పుట్టగొడుగులు పోషకమైనవి అని ఎక్కువ మందికి తెలియదు.కానీ పుట్టగొడుగులతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి అని ఆహార నిపుణులు చెబుతున్నారు.

వీటిని ఆరోగ్యాకరమైన ఆహారంలో దీనిని తప్పకుండా చేర్చుకోవచ్చు.

అంతేకాకుండా ముఖ్యంగా చక్కర వ్యాధి అదుపు చేయడంలో పుట్టగొడుగులు ఎంతో బాగా ఉపయోగపడతాయి.

ఇందులో ఉండే ఫైబర్ విటమిన్లు ఎక్కువగా ఉంటాయి.ఇవి రక్తంలో చక్కెరను తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.

పుట్టగొడుగుల్లో చక్కెర పదార్థం అస్సలు ఉండదు.ఇవి ఇన్సులిన్ ఉత్పత్తి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి.

కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు కచ్చితంగా దీనిని ఆహారంలో చేర్చుకోవడం ఎంతో మంచిది.

అయితే పుట్టగొడుగులు సహజంగానే రోగనిరోధక శక్తిని పెంచే ఆహారమని ఆహార నిపుణులు చెబుతున్నారు.

వాటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీబయోటిక్ లక్షణాలు ఇమ్యూనిటీ ని పెంచడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.అవి కణజాలాన్ని సరి చేయడానికి కూడా ఉపయోగపడతాయి.పుట్టగొడుగులలో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది.అందుకోసం ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ కంటెంట్ ను కలిగి ఉంటుంది.

ఇది ఆకలిని కూడా తగ్గిస్తుంది కాబట్టి ఈ బరువు తగ్గాలనుకునే వారు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

Telugu Diabeteseat, Diabetes, Tips, Immunity, Mushrooms-Telugu Health Tips

పుట్టగొడుగులలో ఫైబర్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి.ఇవి జీర్ణ వ్యవస్థ సమస్యలను దూరం చేయడంలో ఉపయోగపడతాయి.వాటిలో పోలిక్ యాసిడ్, ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది.

ఈ రెండు మూలకాలు హిమోగ్లోబిన్ ను పెంచడం సహాయపడతాయి.ఆరోగ్యకరమైన చర్మం మీ సొంతం కావాలంటే ఖచ్చితంగా పుట్టగొడుగులను తినాలి.

ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబయాల్ గుణాలు చర్మ సమస్యల నుంచి దూరం చేస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube