ప్రస్తుత వర్షాకాలంలో పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా దాదాపు అందర్నీ జలుబు, దగ్గు( Cold, cough ) సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి.ఇవి చెప్పడానికి చిన్న సమస్యలుగానే అనిపించినా.
అనుభవించే వారికి మాత్రం అసలైన నరకం కనిపిస్తుంటుంది.ఈ క్రమంలోనే జలుబు, దగ్గు సమస్యలను వదిలించుకునేందుకు రకరకాల మందులు వాడుతుంటారు.
అయితే మందులతో పని లేకుండా సహజంగా జలుబు, దగ్గు సమస్యలను తరిమికొట్టొచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ డ్రింక్ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.
ముందుగా చిన్న ఉల్లిపాయ ని తీసుకుని తొక్క తొలగించి వాటర్ తో శుభ్రంగా కడగాలి.ఆ తర్వాత ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
అలాగే మూడు వెల్లుల్లి రెబ్బలను పొట్టు తొలగించి సన్నగా తరిగి పెట్టుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.
వాటర్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి తురుము వేసి మరిగించాలి.నీరు సగం అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి.
ఈ వాటర్ లో రెండు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ లెమన్ జ్యూస్ మిక్స్ చేస్తే మన డ్రింక్ రెడీ అవుతుంది.రోజుకు ఒకసారి ఈ డ్రింక్ ను కనుక తీసుకుంటే కేవలం రెండు రోజుల్లోనే అదిరిపోయే రిజల్ట్ ను పొందుతారు.ఈ డ్రింక్ ను తాగడం వల్ల చాలా ఫాస్ట్ గా జలుబు నుంచి రిలీఫ్ పొందుతారు.దగ్గు సమస్య పరార్ అవుతుంది.ఇమ్యూనిటీ పవర్( Immunity power ) పెరుగుతుంది.ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యం శరీరానికి లభిస్తుంది.
అంతేకాదు ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన మలినాలు బయటకు తొలగిపోతాయి.మహిళల్లో నెలసరి సక్రమంగా వస్తుంది.నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు ఉంటే వాటి నుంచి ఉపశమనం పొందుతారు.పైగా ఈ డ్రింక్ వెయిట్ లాస్ ను ప్రమోట్ చేస్తుంది.క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది.మరియు హైపర్ టెన్షన్ ను అదుపులోకి తెచ్చే సామర్థ్యం కూడా ఈ డ్రింక్ కు ఉంది.