చర్మాన్ని తెల్లగా మార్చుకోవడం కోసం చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు.ముఖ్యంగా కొందరు మార్కెట్లో లభ్యమయ్యే ఖరీదైన స్కిన్ వైట్నింగ్ క్రీమ్ లను కొనుగోలు చేసి వాడుతుంటారు.
మరికొందరైతే వేలకు వేలు ఖర్చు పెట్టి ట్రీట్‌మెంట్స్ కూడా చేయించుకుంటారు.కానీ పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే చాలా సులభంగా చర్మాన్ని తెల్లగా మార్చుకోవచ్చు.
అందుకు ఇప్పుడు చెప్పబోయే రెమెడీ చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.
మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక టమాటో ని తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే అర కప్పు బొప్పాయి ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలి.
ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న బొప్పాయి ముక్కలు, టమాటో ముక్కలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, హాఫ్ టేబుల్ స్పూన్ ఆర్గానిక్ పసుపు, వన్ టేబుల్ స్పూన్ పెరుగు, రెండు టేబుల్ స్పూన్లు ఆరెంజ్ పీల్ పౌడర్ వేసుకుని అన్నీ కలిసేంతవరకు బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు కాస్త మందంగా అప్లై చేసుకుని ముప్పై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
అనంతరం వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.ఈ రెమెడీని రెగ్యులర్ గా పాటిస్తే చర్మ ఛాయ సహజంగానే మెరుగు పడుతుంది.మీరు కోరుకున్న విధంగా మీ ముఖ చర్మం తెల్లగా మరియు కాంతివంతంగా మెరుస్తుంది.
కాబట్టి స్కిన్ వైట్నింగ్ కోసం ఆరాటపడేవారు తప్పకుండా ఈ రెమెడీని ట్రై చేయండి.