సాధారణంగా మిగిలిన సీజన్లతో పోలిస్తే ప్రస్తుత చలికాలంలో చుండ్రు సమస్య అనేది మరింత ఎక్కువ అవుతుంది.వాతావరణంలో వచ్చే మార్పులు ఇందుకు ప్రధాన కారణం.
అయితే కారణం ఏదైనాప్పటికీ చుండ్రును నిర్లక్ష్యం చేసే దురద, చికాకుతో పాటు హెయిర్ ఫాల్ సమస్య కూడా తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది.అందుకే వీలనంత త్వరగా చుండ్రును వదిలించుకోవాలి.
అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ రెమెడీ అద్భుతంగా సహాయపడుతుంది.
ఈ రెమెడీని పాటిస్తే కనుక చాలా సులభంగా మరియు వేగంగా చుండ్రును తరిమికొట్టొచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు మెంతులు వేసి వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.
మరుసటి రోజు ఒక ఉల్లిపాయను తీసుకుని తొక్క తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో నానబెట్టుకున్న మెంతులు వాటర్ తో సహా వేసుకోవాలి.
అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైడ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ భృంగరాజ్ పౌడర్, రెండు టేబుల్ స్పూన్లు ఆముదం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తల మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ యూస్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.వారంలో రెండు సార్లు ఈ విధంగా కనుక చేస్తే చుండ్రు చాలా వేగంగా దూరం అవుతుంది.అలాగే ఈ రెమెడీని పాటించడం వల్ల జుట్టు ఒత్తుగా మరియు పొడుగ్గా సైతం పెరుగుతుంది.
కాబట్టి చుండ్రు సమస్యతో బాధపడేవారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.