స్నానం చేసేటప్పుడు మీకు తెలియకుండానే చేసే ఈ పొరపాట్ల కారణంగా ఎంత హాని జరుగుతుందో తెలుసా?

ప్రతి రోజు ప్రతి ఒక్కరు స్నానం చేస్తారు.కానీ కొన్ని సార్లు స్నానం చేసే సమయంలో తెలియకుండానే చేసే కొన్ని పొరపాట్ల కారణంగా జుట్టు,చర్మంనకు హాని కలిగిస్తాయి.

 Before Going To Head Bath Avoid These Mistakes-TeluguStop.com

ఆ పొరపాట్లు చిన్నవే కదా అని అనుకుంటాం.కానీ అవే మనకు తెలియకుండానే చర్మానికి ఎక్కువ హాని చేస్తాయి.

ఇప్పుడు మనం స్నానం చేసే సమయంలో చేసే తప్పుల కారణంగా చర్మానికి ఎలా హాని కలుగుతుందో తెలుసుకుందాం.

సాధారణంగా తల స్నానం చేసే సమయంలో వేడి నీటిని ఉపయోగిస్తాం.

వేడి నీరు బాగా వేడిగా ఉంటే చుండ్రు సమస్య అధికం కావటం మరియు జుట్టు రాలే సమస్య పెరుగుతుంది.అందువల్ల స్నానానికి గోరువెచ్చని నీటిని మాత్రమే ఉపయోగించాలి.

తలస్నానము చేయటానికి ముందు దువ్వెనతో జుట్టును దువ్వితే జుట్టు రాలే సమస్యను కొంతవరకు తగ్గించవచ్చు.తలస్నానం చేసిన వెంటనే తలను దువ్వకూడదు.

ఆలా దువ్వితే జుట్టు తడిగా ఉండుట వలన జుట్టు ఎక్కువగా రాలే ప్రమాదం ఉంది.

తలస్నానము వేడి నీటితో చేసిన తర్వాత చివరగా తల మీద చల్లని నీటిని పోసుకోవాలి.

ఈ విధంగా చేయటం వలన జుట్టు కుదుళ్ళు మూసుకొని జుట్టు రాలకుండా ఉంటుంది.

వేడి నీటితో స్నానం చేసినప్పుడు చర్మం పొడిగా మారుతుంది.

వేడి నీటితో స్నానం చేసినప్పుడు బాగానే ఉన్నా ఆ తరవాత చర్మం పొడిగా మారుతుంది

స్క్రబింగ్ అనేది ముఖానికి మాత్రమే చేస్తూ ఉంటారు.కానీ మృత కణాలు ముఖం మీదే కాకుండా శరీరం అంతా ఉంటాయి.

అందులవల్ల శరీరం మొత్తాన్ని స్క్రబింగ్ చేయాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube