ఎప్పుడైనా అధికారం చెలాయించి మంచి ఫామ్ లో ఉన్న వారికీ కూడా ఒకానొక సమయంలో గడ్డు పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి.ఒక్కసారిగా అధికారం కోల్పోయి క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవాల్సిన సమయం కూడా వస్తుంది.
వారు చెప్పిన ఒక మాట తర్వాత వారి మెడకే చుట్టుకుంటుంది.మరి ఇలాంటి పరిస్థితులనే దిల్ రాజు ఎదుర్కొంటున్నాడు.
పూర్తీ వివరాల్లోకి వెళ్తే.టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు.ఈయన ప్రొడ్యూసర్ గా మాత్రమే కాకుండా నైజాం డిస్టిబ్యూటర్ గా కూడా గత కొన్నేళ్లుగా ఒక వెలుగు వెలుగుతున్నాడు.ఈయన నైజాం లో మాత్రమే కాకుండా ఉత్తరాంధ్రలో కూడా తిరుగులేని డిస్టిబ్యూటర్ గా చక్రం తిప్పుతున్నాడు.
ఆయన ఎంత చెబితే అంత అన్నట్టుగా మారిపోయింది.
అయితే ఇప్పుడు మాత్రం ఈయన చాలా క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు అంటున్నారు.
సంక్రాంతి సీజన్ లో వారసుడు సినిమాను రిలీజ్ చేయడమే ఇందుకు కారణం.గత కొన్నేళ్లుగా ఈయన డామినేషన్ ను భరిస్తున్న మిగతా డిస్టిబ్యూటర్స్ కు ఇప్పుడు మంచి టైం దొరకడంతో దెబ్బేయడానికి సిద్ధంగా ఉన్నారట.
వంశీ పైడిపల్లి కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి కాంబోలో ‘వారసుడు’ సినిమా తెరకెక్కుతుంది.దిల్ రాజు భారీ స్థాయిలో పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది.
ఈ సినిమా డబ్బింగ్ సినిమా అయినప్పటికీ భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని థియేటర్స్ వారితో అగ్రిమెంట్ చేయించు కుంటున్నారట.

మరి కొంత మందితో అగ్రిమెంట్ కు రెడీ అవుతున్నారట.మరి డబ్బింగ్ సినిమా కోసం ఇంత చేస్తున్న దిల్ రాజు నిర్ణయం కరెక్ట్ కాదని కొంత మంది డిస్టిబ్యూటర్స్ దిల్ రాజుకు అడ్డం తిరగ బోతున్నారు అంటూ సమాచారం అందుతుంది.తొలి ప్రాధాన్యత మన తెలుగు సినిమాలకే ఇవ్వాలని అంటున్నారు.
మరి వీరి ఒత్తిడికి ప్రధాన థియేటర్స్ వదిలేసే అవకాశం అయితే కనిపిస్తుంది.







