ప్రతి మహిళ అందమైన మచ్చలు లేని ముఖాన్ని కోరుకుంటుంది.ఆలా ఉండటానికి ఏమి చేయటానికి అయినా సిద్ధంగా ఉంటుంది.
కంటి కింద ముడతలు వచ్చాయంటే ముఖం అందాన్ని దెబ్బతీస్తుంది.ఈ ముడతలను తగ్గించుకోవటానికి ఖరీదైన క్రీమ్స్ వాడటానికి బదులు కొన్ని ఆయిల్స్ ని ఉపయోగిస్తే మంచి ప్రయోజనం కలుగుతుంది.
ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
కొబ్బరినూనె శరీరానికి అవసరమైన తేమను అందించి ముడతలు రాకుండా చేస్తుంది.
కొబ్బరినూనెలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి సమృద్ధిగా ఉండుట వలన ముడతలను తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.ఇప్పుడు పసుపును ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.ఒక స్పూన్ కొబ్బరినూనెలో చిటికెడు పసుపు వేసి బాగా కలిపి కంటి కింద ముడతలు ఉన్న ప్రదేశంలో రాసి 20 నిముషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఆలివ్ నూనె వంటల్లోనే కాదు సౌందర్య సంరక్షణలోను బాగా సహాయపడుతుంది.ఆలివ్ నూనెలో విటమిన్ ఈ మరియు కే లతో పాటు ప్రోటెక్టివ్ యాంటీఆక్సిడాంట్స్ సమృద్ధిగా ఉండుట వలన చర్మానికి అవసరమైన తేమను అందించి వయస్సు రీత్యా వచ్చే ముడతలను తగ్గిస్తుంది.అయితే ఆలివ్ ఆయిల్ ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.
కొంచెం ఆలివ్ ఆయిల్ ని తీసుకోని కంటి కింద ముడతలు ఉన్న ప్రదేశంలో రాసి పది నిముషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.