స్కాట్‌లాండ్ లోని క్లాక్‌మన్నన్‌షైర్ కౌన్సిల్ కు చెందిన కరోలైన్ హంటర్ కు 12 ఏళ్ల ఫ్రేయా అనే కూతురు ఉంది.అయితే ఫ్రేయా పుట్టుకతోనే దివ్యాంగురాలు.
ఫ్రేయా శ్వాస సంబంధమైన సమస్యలతో బాధపడుతోంది.దీంతో ఫ్రేయా కు కృత్రిమంగా ఆక్సిజన్ అందించకపోతే ఆమె ప్రాణానికి ప్రమాదం.
ఆమెకు తన తల్లిదండ్రులు ఒక గదిలో ప్రత్యేకంగా లైఫ్ సపోర్ట్ ఎక్విప్మెంట్ ను అరేంజ్ చేశారు.ఎప్పుడు ఫ్రేయా గదిని వెచ్చగా ఉంచడకోసం, లైఫ్ సపోర్ట్ ఎక్విప్‌మెంట్‌ను నడిపించడానికి విద్యుత్ వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది.అయితే దీని కోసం హంటర్ కుటుంబం ఏడాదికి 6500 పౌండులు అనగా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపుగా రూ.6.2 లక్షలు ఖర్చు అవుతోంది.అయితే, వచ్చే ఏడాదికి ఈ కరెంట్ బిల్లు మరింత ఎక్కువ అవుతుంది అని క్లాక్‌మన్నన్‌షైర్ కౌన్సిల్ హంటర్ కుటుంబాన్ని హెచ్చరించింది.
అసలే కరోలైన్ హంటర్ ది సాధారణ మధ్యతరగతి కుటుంబం కావడంతో తన కూతురిని బతికించుకోవడానికి ఇప్పటికే ఎన్నో కష్టాలు పడుతోంది.అలాంటి, కరెంట్ బిల్లు మరింత అధికమైతే కూతురుని కాపాడుకోవడం ఎలా అనే ఆలోచనలో హంటర్ కుటుంబం పడిపోయింది.
అప్పుడు ఆ కుటుంబం దాతల నుంచి విరాళాలు సేకరించాలని భావించి.గోఫండ్‌మి అనే స్వచ్ఛంద ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలో అకౌంట్ క్రియేట్ చేశారు.అయితే, ఈ అకౌంట్‌లో ఒక్కసారిగా 17వేల పౌండ్‌లు వచ్చి పడ్డాయి.అయితే ఈ మొత్తాన్ని నటి కేట్ విన్స్‌లెన్ దానం చేశారు.

టైటానిక్ నటి అంత పెద్ద మొత్తంలో విరాళం ఇవ్వడాన్ని తాను నమ్మలేకపోతున్నానని 49 ఏళ్ల కరోలైన్ హంటర్ తెలిపింది.ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో వీడియోని షేర్ చేసింది.ఆ వీడియోలో ఆమె ఈ విధంగా చెప్పుకొచ్చింది.తన కుటుంబం ఇప్పటి వరకు చేసిన ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు చూశానని.కానీ, ఈ క్షణాన్ని మాత్రం ఎప్పటికీ మరిచిపోలేనని అంటున్నారు హంటర్.ఇంత పెద్ద మొత్తంలో డబ్బు మా అకౌంట్‌లో పడిందనే వార్త వినగానే తన కళ్లలో నీళ్లు తిరిగాయని చెప్పారు.
ఇది నిజమేనా అనిపించింది.ఇప్పటికీ నాకు ఇది కలలానే ఉంది అంటూ ఎమోషనల్ అయింది.
కాగా టైటానిక్ నటి ఒక పాప ప్రాణం కాపాడటం కోసం అన్ని లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చి తన గొప్ప మనసును చాటుకుంది.







