తూర్పుగోదావరి జిల్లాలో పేలుడు కలకలం సృష్టించింది.దేవరపల్లి మండలం గౌరీపట్నంలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో బ్లాస్ట్ సంభవించింది.
ఈ ప్రమాదంలో పరిశ్రమలో పని చేస్తున్న ముగ్గురు కార్మికులు మృత్యువాత పడ్డారు.మృతులు మహీధర్, రత్నబాబు, సత్యనారాయణలుగా గుర్తించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.అనంతరం పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.







