Rashmika mandanna without make up: మేకప్ లేకుంటే రష్మిక ఇంత అందంగా ఉంటుందా.. ఫోటోలు చూస్తే వావ్ అనాల్సిందే!

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నేషనల్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.రష్మిక మందన ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసింది భాషతో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.

 Rashmika Mandanna Shared Cute Photos Without Make Up Her Beauty Over Load Pics D-TeluguStop.com

కాగా ఇటీ వలె తెలుగులో విడుదల అయినా పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయిన విషయం తెలిసిందే.దీంతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతినిండా బోలెడు ప్రాజెక్టులు ఉన్న విషయం తెలిసిందే.హిందీ తెలుగు తమిళ భాషల్లో నటిస్తూ బిజీబిజీగా ఉంది.

ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో రష్మిక మందనాకు సంబంధించిన కొన్ని ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

ఆ ఫోటోలలో రష్మిక మందన్న వితౌట్ మేకప్ లో కనిపిస్తోంది.

కేవలం మేకప్ వేసుకొని మాత్రమే కాకుండా మేకప్ లేకుండా కూడా సహజమైన అందాలను చూపించింది రష్మిక మందన.ఎంచక్కా స్పెడ్స్ పెట్టుకొని నవ్వుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

కాగా వితౌట్ మేకప్ లు రష్మిక మందన మరింత క్యూట్ గా కనిపించడం విశేషం.ఈ ఫోటోలు వైరల్ అవ్వడంతో అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ప్రస్తుతం సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకున్న రష్మిక మందన సోషల్ మీడియాలో వరుసగా వితౌట్ మేకప్ లో క్యూట్ ఫోటోలను షేర్ చేస్తూనే ఉంది.ఈ క్రమంలోనే తాజాగా ఆరెంజ్ కలర్ డ్రెస్ లో ఒక సైడ్ నుంచి కొంటె చూపులతో చూస్తూ తన చూపులతోనే ఆకట్టుకుంటుంది.

Telugu Childrens Day, Latest, Tollywood-Movie

ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది.ఇది ఇలా ఉంటే తాజాగా ఆమె తన పెట్ తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసింది.ఆ ఫోటోని షేర్ చేస్తూ ఒక చిన్న కొటేషన్ ని కూడా రాసుకు వచ్చింది.తాను చిన్నప్పుడు స్కూల్‌లో ఉన్నప్పుడు బాలల దినోత్సవం ఎలా జరుపుకునేవాళ్లమో తనకు ఇంకా గుర్తుందని, అయితే ఆ దినోత్సవ ప్రత్యేకత తెలియక ముందే చాలా వేగంగా పెరిగామని చెప్పుకొచ్చింది రష్మిక మందన.

అలాగే ఇన్ని ఏళ్లలో తాను నేర్చుకున్నది ఏంటంటే జీవితం చాలా చిన్నది.ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలని పేర్కొంది.అందరు దయ, సంతోషం, ఆశ, ప్రేమతో జాగ్రత్తగా ఉండాలని చెబుతూ బాలల దినోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది రష్మిక మందన్న.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube