ఓవైపు డైరెక్టర్లుగా చేస్తూనే.మరోవైపు ప్రొడ్యూసర్లుగా మారుతున్నారు కొందరు దర్శకులు.
గత కొంత కాలంగా కొత్త దర్శకులను ప్రోత్సహిస్తూ నిర్మాతలుగా చేస్తున్నారు.అయితే దర్శకులుగా మంచి హిట్స్ సాధించినా.
నిర్మాతలుగా తీసిన సినిమాలు డిజాస్టర్ అయ్యాయి.ఇంతకీ వాళ్లు చేసిన సినిమాలు ఏంటి? ఆ దర్శకనిర్మాతలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
వైవిఎస్ చౌదరి-నిప్పు
గుణ శేఖర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా చేసిన సినిమా నిప్పు.ఈ మూవీ పెద్ద ఫ్లాప్ అయ్యింది.లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, సీతయ్య లాంటి హిట్ మూవీస్ తీసిస చౌదరి.నిర్మాతగా ఫెయిల్ అయ్యాడు.
సుకుమార్-దర్శకుడు
కుమారి 21ఎఫ్ తో మంచి హిట్ కొటిన తన రెండో సినిమా దర్శకుడు.ప్రొడ్యూసర్ గా చేసి ప్లాప్ అయ్యాడు.
సంపత్ నంది-గాలిపటం, పేపర్ బాయ్
ఏమైంది ఈవేళ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంపత్.తర్వాత రచ్చ, గౌతమ్ నంద, బెంగాల్ టైగర్ సినిమాలు తీశాడు.గాలిపటం, పేపర్ బాయ్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి ప్లాప్ అయ్యాడు.
పూరీ జగన్నాథ్-మహబూబా
దర్శకుడిగా, నిర్మాతగా ఇస్మార్ట్ శంకర్ తో హిట్ కొట్టిన పూరీ జగన్నాథ్.తన కొడుకుని హీరోగా పెట్టి ప్రొడ్యూస్ చేసిన మహబూబా మూవీ ఫ్లాప్ అయ్యింది.
క్రిష్- అంతరిక్షం
అంతరిక్షం సినిమాతో ప్రొడ్యూసర్ గా మారిన క్రిష్ కు తొలి సినిమాతోనే పెద్ద దెబ్బ పడింది.
రవిబాబు-అదుగో
తాజాగా రవిబాబు దర్శకుడిగా, నిర్మాతగా తీసిన ప్రయోగాత్మక సినిమా అదుగో.ఈ సినిమా ప్లాప్ అయ్యింది.
మారుతి-లండన్ బాబు
ప్రేమ కథా చిత్రమ్, భలె భలె మగాడివోయ్ లాంటి హిట్ సినిమాలు తీసిన మారుతి.తను ప్రొడ్యూసర్ గా చేసిన లండన్ బాబు ప్లాప్ అయ్యింది.
అనిల్ రావిపూడి-గాలి సంపత్
అనిల్ రావిపూడి నిర్మాతగా వ్యవహరించిన గాలి సంపత్ బోల్తా కొట్టింది.ప్రొడ్యూసర్ గా ఈ దర్శకుడు ఫెయిల్ అయ్యాడు.