సాధారణంగా వాతావరణంలో మార్పుల వల్ల కొందరిలో తుమ్ములు పదేపదే వస్తుంటాయ్.ఇలా మాటిమాటికి తుమ్ములు రావడం వల్ల చికాకు కలిగిస్తుంది.
ఇతరులకు ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది.అసలే కరోనా సమయంలో ఇలా తుమ్ములు రావడం వల్ల ప్రతి ఒక్కరూ భయపడుతూ ఉంటారు.
మరి ఇలా తుమ్ములు రాకుండా ఉండాలంటే ఈ క్రింది చిట్కాలను పాటించండి!
తుమ్మలను నివారించడంలో అల్లం ఎంతో ఉపయోగకరంగా పనిచేస్తుంది.అల్లంతో చేసిన టీ తాగడం వల్ల తుమ్మల నుండి ఉపశమనం లభిస్తుంది.
నిరంతరం తుమ్ములు బాధించేవారికి వెల్లుల్లి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.వెల్లుల్లిలో ఎక్కువ భాగం యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. వెల్లుల్లి రెబ్బలను మెత్తగా దంచి, నీటిలో వేసి బాగా మరగనివ్వాలి.ఆ నీటిని కొద్ది కొద్ది పరిమాణంలో రోజంతా తాగడం వల్ల తుమ్మల నుంచి ఉపశమనం పొందవచ్చు.

దాల్చిన చెక్కలో యాంటీ వైరల్ లక్షణాలు ఎక్కువగా ఉండటం వల్ల మనకు తుమ్ములు రాకుండా ఆపుతుంది.దాల్చిన చెక్క పొడిలోకి కొద్దిగా తేనెను కలిపి తీసుకోవడం ద్వారా వెంటనే ఉపశమనం కలుగుతుంది.
నిరంతరం బాధించే తుమ్ములు నుంచి ఉపశమనం కలగాలంటే కొద్దిగా తేనెలోకి నిమ్మరసం కలిపి తీసుకోవాల.తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు, నిమ్మరసంలోని విటమిన్ సి అధికంగా ఉండడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు, జలుబు, తుమ్ములు వంటివాటిని నివారిస్తుంది.

ఆగకుండా తుమ్ములు మనల్ని ఇబ్బంది పెడుతుంటే, ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడిని తీసుకొని, ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగడం వల్ల తుమ్మల నుండి త్వరగా ఉపశమనం కలుగుతుంది.
పసుపులో ఉండే కర్క్యుమిన్ అనే యాంటీ బ్యాక్టీరియల్ దగ్గు జలుబు వంటి సమస్యల నుండి దూరం చేస్తుంది.అందువల్ల ప్రతి రోజు ఆహారంలో పసుపు తీసుకోవడం ఎంతో మంచిది.అంతేకాకుండా రాత్రి పడుకునే సమయంలో గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు కలుపుకుని తాగడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు.
చూశారు కదా ఈ చిట్కాలను పాటించడం ద్వారా తుమ్ములు రాకుండా ఆపవచ్చు.