మృత‌క‌ణాలు పోయి ముఖం అందంగా మారాలా? అయితే ఇలా చేయండి!

మృత‌క‌ణాలు(డెడ్ స్కిన్ సెల్స్‌) పేరుకుపోయే కొద్ది ముఖ చ‌ర్మం కాంతిహీనంగా మారిపోతూ ఉంటుంది.ఈ క్ర‌మంలోనే స్కిన్ టోన్ త‌గ్గిపోతుంది.

 This Mask Removes Dead Skin Cells And Beautifies The Face ,  Face Mask , Latest-TeluguStop.com

పైగా మొటిమ‌లు, ముడ‌త‌లు వంటి స‌మ‌స్య‌లు సైతం వేధిస్తూ ఉంటాయి.అందుకే ఎప్ప‌టికప్పుడు డెడ్ స్కిన్ సెల్స్‌ను తొల‌గించుకోవాల‌ని సౌంద‌ర్య నిపుణులు సూచిస్తుంటారు.

అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీని ట్రై చేస్తే గ‌నుక సుల‌భంగా డెడ్ స్కిన్ సెల్స్‌ను వ‌దిలించుకోవ‌చ్చు.అలాగే మ‌రెన్నో స్కిన్ కేర్ బెనిఫిట్స్ నూ పొందొచ్చు.

మ‌రి ఆ రెమెడీ ఏంటో లేట్ చేయ‌కుండా కింద‌కు ఓ లుక్కేసేయండి.

ముందుగా ఒక క్యారెట్‌, ఒక బంగాళ‌దుంప తీసుకుని పీల్ తొల‌గించి నీటిలో శుభ్రంగా క‌డిగి ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.

ఈ ముక్క‌లను బ్లెండ‌ర్‌లో వేసి కొద్దిగా వాట‌ర్ పోసి మెత్త‌టి పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి.ఈ పేస్ట్ నుంచి జ్యూస్‌ను మాత్రం స‌ప‌రేట్ చేసుకోవాలి.ఇప్పుడు స్ట‌వ్ ఆన్ చేసి గెన్నెను పెట్టుకుని క్యారెట్‌, బంగాళ‌దుంప జ్యూస్ వేసుకోవాలి.

జ్యూస్ హీట్ అవ్వ‌క ముందే అందులో వ‌న్ టేబుల్ స్పూన్ జెలటిన్ పౌడ‌ర్‌ను కూడా వేసుకుని స్పూన్‌తో తిప్పుకుంటూ ఒక‌టి, రెండు నిమిషాల పాటు ఉడికించుకుని.స్ట‌వ్ ఆఫ్ చేయాలి.ఉడికించుకున్న మిశ్ర‌మాన్ని బాగా చ‌ల్లార‌బెట్టుకుని.

అప్పుడు బ్రష్ సాయంతో ముఖానికి కాస్త మందంగా అప్లై చేసుకోవాలి.ఆపై ఓ ఇర‌వై, ముప్పై నిమిషాల పాటు ముఖాన్ని డ్రై అవ్వ‌నిచ్చి.

ఆ త‌ర్వాత సున్నితంగా మాస్క్‌ను తొల‌గించాలి.

ఇలా వారంలో రెండు సార్లు చేస్తే చ‌ర్మంపై పేరుకుపోయి ఉన్న మృత‌క‌ణాలు, మ‌లినాలు తొల‌గిపోతాయి.చ‌ర్మ ఛాయ పెరుగుతుంది.మొటిమ‌లు, వాటి తాలూకు మ‌చ్చులు ఏమైనా ఉంటే.

క్ర‌మంగా త‌గ్గిపోతాయి.మ‌రియు చ‌ర్మంపై ఏర్పిడిన ముడ‌త‌ల నుంచి సైతం ఉప‌శ‌మ‌నం పొందొచ్చు.

కాబ‌ట్టి, పైన చెప్పిన సింపుల్ రెమెడీని ఖ‌చ్చితంగా ప్ర‌య‌త్నించండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube