డయాబెటిక్ రెటినోపతి వస్తే ఎంత ప్రమాదమో తెలుసా..?

ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా డయాబెటిస్ తో( Diabetes ) చాలా బాధపడుతూ ఉన్నారు.రక్తంలో షుగర్ స్థాయిలు పెరగడం వలన డయాబెటిస్ పెరిగిపోయి, ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారు.

 What Is Diabetic Retinopathy Know Symptoms And Treatment Details, Diabetic Reti-TeluguStop.com

అయితే కొన్ని కీలక టెస్టులు చేసుకోవడం మాత్రం డయాబెటిస్ పేషెంట్లకు చాలా అవసరం.ముఖ్యంగా డయాబెటిక్ రెటినోపతి వ్యాధి( Diabetic Retinopathy ) ఈ మధ్యకాలంలో డయాబెటిస్ ఉన్న ప్రతి బాధితులకు బాగా దెబ్బతీస్తోంది.

చాలామందికి దీని పై అవగాహన ఉండదు.ఈ నేపథ్యంలో డయాబెటిక్ రెటినోపతి అంటే ఏంటో దానికి సంబంధించిన లక్షణాలు నివారణ మార్గాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Blindness, Sugar Levels, Diabetes, Diabetic, Eyes, Tips-Telugu Health

చిన్న వయసులోనే డయాబెటిస్ తో ఈ మధ్యకాలంలో చాలామంది బాధపడుతున్నారు.అలాంటి వారు కాలక్రమేన, రక్తంలో షుగర్ స్థాయిలు( Blood Sugar Levels ) పెరిగి అవి రెటీనా ను దెబ్బతీస్తాయి.డయాబెటిక్ రెటినోపతి బారిన పడకుండా ఉండాలంటే డయాబెటిస్ తో ఉన్నవారు ప్రారంభంలోనే రక్తంలో షుగర్, బీపీ స్థాయిలను తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.అందుకు అమెరికా వైద్య బృందం మంచి చికిత్సను సూచిస్తుంది.

డయాబెటిస్ ప్రారంభ దశలో టైప్ 1 డయాబెటిస్ ఉన్న వారిలో 52%, టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో 56% మందిలో డయాబెటిస్ రెటినోపతి పరిస్థితి ఉన్నట్లు గమనించడం జరిగింది.అయితే జనాభాలో డయాబెటిక్ రెటినోపతి పట్ల గురించి అవగాహన చాలా తక్కువగా ఉంటుంది.

Telugu Blindness, Sugar Levels, Diabetes, Diabetic, Eyes, Tips-Telugu Health

కొన్ని వైద్య పరీక్షలు చేయించుకోవడం వలన కంటిని( Eyes ) డయాబెటిక్ వ్యాధి బారిన పడకుండా కాపాడుకోవచ్చు.అందులో మొదటిది HBA1C.ఈ పరీక్ష ద్వారా డయాబెటిస్ ఉందా లేదా అనేది నిర్ధారణ అవుతుంది.బేస్ లైన్ రెటీనా పరీక్ష చేయించుకోవడం వలన డయాబెటిస్ రెటినోపతి బారిన పడ్డారా లేదా అన్నది కూడా తెలుసుకోవచ్చు.

ఈ విధంగా డయాబెటిక్ రెటినోపతి సమస్యలను నివారించడానికి శారీరక వ్యాయామం, సమతుల్య ఆహారంతో డయాబెటిస్ నియంత్రణలో పెట్టుకోవాలి.అసలు డయాబెటిక్ రెటినోపతి వస్తే దృష్టిని కోల్పోవడం, అంధత్వం రావడం లాంటి ప్రమాదాలు జరుగుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube