టాలీవుడ్ ఇండస్ట్రీలో వేణుస్వామి సంచలనం అనే సంగతి తెలిసిందే.వేణుస్వామి(Venuswami) ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడినా ఆ మాటలు ఒకింత హాట్ టాపిక్ అవుతూ ఉంటాయి.
తాజాగా ఒక సందర్భంలో వేణుస్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.నన్ను కెలికినప్పటి నుంచి ఇండస్ట్రీలో ఇబ్బందులు మొదలయ్యాయని వేణుస్వామి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
2025 సంవత్సరం మార్చి(Marche) నెల నుంచి రాజకీయంగా పెను సంచలనాలు నమోదు కానున్నాయని వేణుస్వామి(Venuswani) పేర్కొన్నారు.తెలుగు సినీ పరిశ్రమ గింగిరాలు తిరుగుతుందని నేను ఆగష్టులో ఒక ఇంటర్వ్యూలో చెప్పానని వేణుస్వామి చెప్పుకొచ్చారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో ఎవరూ ఊహించని నాలుగు ఇన్సిడెంట్లు చోటు చేసుకున్నాయని ఇలాంటి పరిస్థితిని ఎప్పుడైనా చూశారా అని ఆయన అన్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోకు సంబంధించిన కన్వెన్షన్ ను కూల్చేశారని భారతదేశానికి పేరు తెచ్చిన డైరెక్టర్ ను టార్చర్ పెట్టారని పాన్ ఇండియా హీరోను (Pan India Hero)ఒకరోజు జైలులో పెట్టారని 72 సంవత్సరాల చరిత్ర ఉన్న ఒక వ్యక్తి కుటుంబంలో గొడవలు అని వేణుస్వామి తెలిపారు.నాగార్జున, ఆర్జీవీ, బన్నీ, మోహన్ బాబులను (Nagarjuna, RGV, Bunny, Mohan Babu)ఉద్దేశిస్తూ వేణుస్వామి ఈ కామెంట్లు చేయడం గమనార్హం.

ఇంకా చాలా ఉన్నాయని ఇంకా చాలా జరుగుతాయని నేను ఆగష్టు నెలలోనే టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్పానని ఆయన పేర్కొన్నారు.వేణుస్వామి చేసిన కామెంట్లను నమ్మేవాళ్లు ఏ స్థాయిలో ఉన్నారో విమర్శించే వాళ్లు సైతం అదే స్థాయిలో ఉన్నారు.ఆయన మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చాలామంది ఫీలవుతూ ఉంటారు.
వేణుస్వామి జాతకం చెప్పిన విషయాలలో కొన్ని నిజమైతే కొన్ని జరగలేదు.అందువల్ల జ్యోతిష్కుడు వేణుస్వామి జాతకాన్ని నమ్మే వాళ్లు, నమ్మని వాళ్ల విషయంలో సైతం తేడాలు ఉన్నాయి.