టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ( Allu Arjun )కు కాలం కలిసొచ్చి సినిమాలు హిట్టవుతున్నా ఆ ఆనందాన్ని ఎంజాయ్ చేయలేని పరిస్థితి ఉందా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది.పుష్ప1, పుష్ప2 సినిమాలు హిట్టైనా బన్నీకి ఆనందం మిగల్లేదని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.పుష్ప ది రైజ్ మూవీ ( Pushpa The Rise Movie )రిలీజైన సమయంలో ఏపీలో టికెట్ రేట్లు తక్కువగా ఉన్నాయి.ఆ సమయంలో మేకర్స్ చేసిన కొన్ని తప్పుల వల్ల పుష్ప రిలీజైన కొన్ని థియేటర్లు మూతబడ్దాయి.
వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఏపీలోని కొన్ని ఏరియాలలో పుష్ప ది రైజ్ కు నష్టాలు వచ్చాయి.ప్రముఖ డైరెక్టర్ తన థియేటర్ లో పుష్ప ది రైజ్ కు నష్టాలు వచ్చాయని బహిరంగంగానే చెప్పుకొచ్చారు.
పుష్ప ది రైజ్ నార్త్ లో హిట్ కావడంతో మేకర్స్ కు ఎలాంటి ఇబ్బంది కలగలేదు.పుష్ప ది రూల్ రిలీజ్ సమయానికి మళ్లీ ఇలాంటి పరిస్థితులే నెలకొనడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
సంధ్య థియేటర్ ( Sandhya theater )తొక్కిసలాట ఘటన బన్నీ కెరీర్ లో మాయని మచ్చలా నిలిచిపోతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.బన్నీ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.బన్నీ పారితోషికం ప్రస్తుతం 200 నుంచి 300 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.బన్నీ మార్కెట్ పెరగడంతో మేకర్స్ రెమ్యునరేషన్ విషయంలో రాజీ పడటం లేదు.
బన్నీతో సినిమాలను తీసిన దర్శకులకు సైతం పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వస్తుండటం గమనార్హం.అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబో మూవీ 2025 ఏప్రిల్ లో మొదలుకానుంది.ఈ సినిమా 2026 చివర్లో విడుదలయ్యే అవకాశం అయితే ఉందని తెలుస్తోంది.అల్లు అర్జున్ తర్వాత సినిమాలతో సైతం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకుంటారేమో చూడాలి.