ఉప్పునీరు తాగడం వల్ల శ‌రీరంలో ఏం జ‌రుగుతుందో తెలుసా?

మన శరీరానికి ఉప్పు లేదా సోడియం అవసరమ‌న్న సంగ‌తి తెలిసిందే.సోడియం శరీరంలో ఉండే ముఖ్యమైన ఎలక్ట్రోలైట్స్‌లో ఒకటి.

 Do You Know What Happens In The Body Due To Drinking Salt Water? Salt Water, Sal-TeluguStop.com

నాడీ వ్యవస్థ, కండరాల పని(Nervous system, muscle function), మరియు ద్రవ స్థితి సంతులనాన్ని నియంత్రించడంలో సోడియం కీల‌క పాత్ర‌ను పోషిస్తుంది.అలా అని ఉప్పును అధిక మొత్తంలో తీసుకుంటే ర‌క్త‌పోటు, గుండె (High blood pressure, heart)స‌మ‌స్య‌ల‌తో స‌హా లేనిపోని జ‌బ్బులు త‌లెత్తుతాయి.

మనందరికీ ఉప్పు అవ‌స‌ర‌మే.కానీ తక్కువ మొత్తంలో అవసరం.

ఇక‌పోతే కొంద‌రు గోరు వెచ్చని వాట‌ర్ లో చిటికెడు సముద్ర ఉప్పు కలిపి తాగుతుంటారు.అస‌లు ఉప్పు నీరు తాగ‌డం(Drinking salt water) వ‌ల్ల శ‌రీరంలో ఏం జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉదయం ఖాళీ కడుపుతో ఉప్పు నీటిని తాగడం ద్వారా డీటాక్సిఫికేషన్(Detoxification) జ‌రుగుతుంది.అంటే శరీరంలోని వ్యర్థాల‌ను బ‌ట‌య‌కు పోతాయి.ఉప్పు నీరు (Salt water)చెమట ద్వారా మీ శరీరం నుండి విషపూరిత సమ్మేళనాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది.డీటాక్సిఫికేషన్ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

Telugu Anxiety, Tips, Latest, Salt, Salt Benefits, Salt Effects, Sea Salt, Stres

అలాగే సముద్ర ఉప్పులో ఉండే ఖనిజాలు శరీరానికి మంచి హైడ్రేషన్ ఇస్తాయి.ఉప్పు నీరు త్రాగడం వలన మీరు హైడ్రేటెడ్ గా(Stay hydrated) ఉంటారు.అద‌నంగా సరైన ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్‌ను నిర్వహించడంలో కూడా ఉప్పు నీరు సహాయపడుతుంది.ఉప్పు నీరు మానసిక ప్రశాంతత అందిస్తుంద‌ని కొంత‌మంది చెబుతుంటారు. ఒత్తిడి, ఆందోళ‌న (Stress, anxiety)వంటి స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది ప‌డుతున్న‌ప్పుడు చిటికెడు స‌ముద్ర‌పు ఉప్పును గోరు వెచ్చ‌ని నీటిలో క‌లిపి తీసుకుంటే రిలీఫ్ పొందొచ్చు.
ఉప్పు నీటిలో ఉండే సొడియం మరియు ఖనిజాలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో తోడ్ప‌డ‌తాయి.

ఉప్పు క‌లిపిన వేడి నీటిని పుక్కిలించుకోవడం వ‌ల్ల‌ గొంతు నొప్పి తగ్గుతుంది.అంతేకాకుండా ఉప్పునీరు చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి మరియు పునరుద్ధరించడానికి కూడా సహాయపడుతుంది.

Telugu Anxiety, Tips, Latest, Salt, Salt Benefits, Salt Effects, Sea Salt, Stres

అయితే మంద‌న్నారు క‌దా అని అధికంగా ఉప్పు నీటిని తాగితే అధిక‌ రక్తపోటు బారిన ప‌డ‌తారు.ఉప్పు నీటిని ఎక్కువగా తాగితే.శరీరంలోని నీటి నిల్వ‌లు త‌గ్గి డీహైడ్రేషన్‌కు గుర‌వుతారు.అదే స‌మ‌యంలో శరీరంలో పొటాషియం స్థాయిలు కూడా త‌గ్గుపోయి.ఫైన‌ల్ గా చెప్పేది ఏంటంటే.ఉప్పు నీరు మంచిదే.

కానీ, ప్రతి రోజు తాగడం మ‌రియు అధిక మొత్తంలో తాగ‌డం మంచిది కాదు.వారానికి ఒక‌సారి చిటికెడు సముద్ర ఉప్పును ఒక గ్లాస్ గోరువెచ్చ‌ని నీటిలో క‌లిపి తీసుకోవ‌చ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube