మధుమేహం లేదా చక్కెర వ్యాధి.ఒకప్పుడు వయసు పైబడిన వారిలోనే ఇది కనిపించేది.
కానీ, ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా కోట్లాది మంది మధుమేహానికి గురవుతున్నాయి.ఆహారపు అలవాట్లు, అధిక ఒత్తిడి, జీవన శైలిలో మార్పులు, మద్యపానం, ఊబకాయం వంటి రకరకాల కారణాల వల్ల మధుమేహం బారిన పడుతూ ముప్ప తిప్పలు పడుతున్నారు.
ఇకపోతే మధుమేహం ఉన్న వారు తీసుకునే ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.ఇందులో భాగంగానే రోజులో మొదట ఆహారం అయిన బ్రేక్ ఫాస్ట్‌లో మధుమేహులు ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
గుడ్డు.సంపూర్ణ పోషకాహారం.అందుకే ఇది ఆరోగ్య పరంగా అనేక ప్రయోజనాలను అందిస్తుంది.ముఖ్యంగా మధుమేహులకు గుడ్డు చాలా మేలు చేస్తుంది.
ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఒక ఉడికించిన గుడ్డును తీసుకుంటే.గుండె పోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
ఎముకలు, కండరాలు దృఢంగా మారతాయి.మరియు శరీర బరువు అదుపులో ఉంటుంది.
మెంతి పరోటా.రుచితో పాటు దీనిలో పోషకాలు మెండుగానే ఉంటాయి.మధుమేహులకు బెస్ట్ బ్రేక్ ఫాస్ట్‌గా కూడా మెంతి పరోటాను చెప్పుకోవచ్చు.అల్పాహారంలో మెంతి పరోటాను తినడం అలవాటు చేసుకుంటే, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు.
అదే సమయంలో శరీరానికి అవసరం అయ్యే ఎన్నో పోషకాలను సైతం మెంతి పరోటాతో సొంతం చేసుకోవచ్చు.

బ్లాక్ బీన్స్.మధుమేహం వ్యాధిగ్రస్తులకు ఇవి ఎంతో మంచివి.అల్పాహారంలో ఉడికించిన బ్లాక్ బీన్స్ ను తీసుకుంటే.
అందులోని పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలు నార్మల్‌గా ఉంచేందుకు సహాయడతాయి.అలాగే బ్లాక్ బీన్స్‌ను తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ చురుగ్గా మారుతుంది.
ఒత్తిడి, ఆందోళన వంటివి దూరం అవుతాయి.మరియు అతి ఆకలి సమస్య నుంచి బయటపడొచ్చు.