హీరోయిన్ సనా ఖాన్( Sana Khan ) గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.2005లో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈమె పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన కత్తి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.మొదటి సినిమాతోనే భారీగా గుర్తింపును తెచ్చుకుంది సనా ఖాన్.ఈ సినిమా తర్వాత ఈమెకు అవకాశాలు వరుసగా క్యూ కట్టాయి.కత్తి సినిమా ( katti movie )తర్వాత మిస్టర్ నూకయ్య గగనం వంటి సినిమాలలో నటించి మరింత గుర్తింపు తెచ్చుకుంది.ఒకప్పుడు టాలీవుడ్ లో ఒక మెరుపు మెరిసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత కనిపించకుండా పోయింది.
ఇక కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే ఈ ముద్దుగుమ్మ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.కాగా వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు.పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది సనా ఖాన్.సోషల్ మీడియాలో తరచుగా యాక్టివ్ గా ఉండే ఈమె తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ లో సనాఖాన్ ఒక వీడియో షేర్ చేసింది.
ఆ వీడియోలో సనా ఖాన్ మాట్లాడుతూ.నేను ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలకు జన్మ ఇవ్వాలని అనుకుంటున్నాను.ఆ సంఖ్య ఐదు కావొచ్చు.
పది కావచ్చు.పూర్వకాలంలో మహిళలు 12-12 మంది పిల్లలను ప్రసవించే వారట.
నేను గర్భం ధరించినప్పటి నుంచి నా భర్త అనాస్ నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు.నాకు డెలివరీ అయ్యే వరకు కంటికి రెప్పలా నా వెంటే ఉన్నాడు అని చెప్పుకొచ్చింది.
దీంతో ఈమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.ఇక దీనిపై నెటిజన్లు ఆమెను బాగా ట్రోల్ చేస్తున్నారు.
ఇంకొందరు మాత్రం ఆమె చేసిన కామెంట్స్ కి మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.