సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్( Allu Arjun ) హీరోగా నటించిన పుష్ప 2 సినిమా( Pushpa 2 ) ఇటీవల డిసెంబర్ 5న విడుదలైన విషయం తెలిసిందే.ఈ సినిమా విడుదల అయ్యి రెండు వారాలు అవుతున్న సరే పుష్ప సినిమా హవా ఇంకా కొనసాగుతూనే ఉంది.
బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల మూత మోగిస్తూ దూసుకుపోతోంది పుష్ప 2 సినిమా.పుష్ప 2 సినిమాకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు.
మరి ముఖ్యంగా సినిమాలో సీన్ సినిమాకి హైలెట్ అని చెప్పవచ్చు.ఈ సీన్ కోసం మూవీ కి వెళ్తున్న వారు చాలామంది ఉన్నారు.
మూవీలోని జాతర సీన్ అయితే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది.
ఎందుకంటే ఒకరిద్దరు మహిళలు ఏకంగా కూర్చున్న సీటులోనే పూనకాలతో ఊగిపోయిన ఒకటి రెండు వీడియోలు సోషల్ మీడియాలో మీరు చూసే ఉంటారు.ఇప్పుడు ఇలాంటి ఒక షాకింగ్ అనుభవం యువ నటికి ఎదురైంది.ఇదే విషయాన్ని ఆమె తన ఇంస్టాగ్రామ్ లో పంచుకుంది.
ఆమె మరెవరో కాదు తమిళ నటి, బిగ్‌బాస్ ఫేమ్ సంయుక్త షణ్ముగనాథన్.( Samyuktha Shanmuganathan ) ఇటీవల ఈమె పుష్ప 2 సినిమా చూడటానికి వెళ్లిందట.
అయితే సినిమాలో జాతర సీన్ వచ్చినప్పుడు ఈమె పక్కన కూర్చున్న మహిళ సామీ అని గట్టిగా అరిచిందట.దీంతో సంయుక్త తెగ భయపడిపోయిందట.
ఆమె భర్త ఏమో తనని కంట్రోల్ చేయాలని చూశాడట.
అప్పుడు తనకు భయమేసి పది రూపాయుల టికెట్ కు వెళ్లి కూర్చున్నా అని సంయుక్త ఇన్ స్టాలో స్టోరీ పోస్ట్ చేసింది.అయితే పూనకాలు రావడం, భయపడటం కాదు గానీ థియేటర్లలో ఇంకా రూ.10 టికెట్స్ ఉన్నాయా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.అది కూడా మాల్ లో ఇంత తక్కువ రేటు ఏంటి? అని ఈమెని ట్రోలింగ్ చేస్తున్నారు.అయితే ప్రస్తుతం పుష్ప సినిమా టికెట్లు రేట్లు తగ్గిన విషయం తెలిసిందే.
ఎప్పటిలాగే నార్మల్గానే సినిమా టికెట్లు రేట్లు ఉన్నాయి.