కుక్కల కోసం ఇంటి పెరటిని స్వర్గంగా మార్చేసిన ఫ్లోరిడా వ్యక్తి.. వీడియో వైరల్‌..

ఫ్లోరిడాలో( Florida ) ఎప్పుడూ ఎండలే కదా అనుకుంటాం.కానీ ఒక వ్యక్తి తన కుక్కల కోసం ఏకంగా తన పెరట్లోనే మంచు( Snow ) కురిపించాడు, ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయిపోయింది.3.4 మిలియన్ల మందికి పైగా దీన్ని చూశారంటేనే అర్థం చేసుకోవచ్చు ఎంత క్రేజ్ లభించిందో! వైరల్ వీడియోలో లూనా( Luna ) అనే గోల్డెన్ రిట్రీవర్ తన యజమాని వైపు క్యూట్‌గా చూస్తూ ఉంటుంది.మంచులో ఆడుకోవాలని ఉందని సైగలు చేస్తుంది.దానికి యజమాని ఫన్నీగా “సారీ లూనా, స్విట్జర్లాండ్ వెళ్లలేం” అంటాడు.ఆ తర్వాత ఫ్లోరిడా వేడిని చూపిస్తూ “ఇక్కడ 80 డిగ్రీల వేడి ఉంది” అంటాడు.

 Florida Man Turns Garden Into Snow Wonderland For Dogs Video Viral Details, Dogs-TeluguStop.com

ఆ తర్వాత అసలు ట్విస్ట్ మొదలవుతుంది.ట్రక్కుల నిండా మంచు వచ్చి పెరట్లో( Garden ) దిగుతుంది.క్షణాల్లో పెరడంతా మంచు దుప్పటిలా మారిపోతుంది.అప్పుడు యజమాని ఎక్స్‌ప్రెషన్ చాలా హ్యాపీగా మారిపోతుంది అతను “చాలా బాగుంది” అంటూ తెగ సంబరపడిపోతాడు.“నా కుక్కలు( Dogs ) ఈ శీతాకాలపు స్వర్గాన్ని తెగ ఎంజాయ్ చేస్తాయి” అని మురిసిపోతుంటాడు.

లూనా, తన డాగ్ ఫ్రెండ్ తో కలిసి మంచులోకి అడుగుపెట్టగానే వాటి ఆనందం రెట్టింపు అవుతుంది.అవి గిర్రున తిరుగుతూ, గెంతులేస్తూ, దొర్లుతూ.అచ్చం పిల్లల్లాగా సందడి చేశాయి.వాటిని చూస్తుంటే ఎవరికైనా నవ్వొస్తుంది, ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు.ఒకరు “ఇంతకంటే కూల్ డాగ్ డాడ్ ఎవరూ ఉండరు” అని కామెంట్ చేస్తే, మరొకరు “అతను తలుచుకుంటే ఏదైనా చేస్తాడు” అంటూ ఫన్నీ కామెంట్ పెట్టారు.ఇంకొకరు “లూనా సంతోషంగా ఉంటే అదే పదివేలు” అని రాశారు.

నిజమే కదా, కుక్కలు మన బెస్ట్ ఫ్రెండ్స్ అని ఎందుకు అంటారో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.

కుక్కల విశ్వాసానికి ఇది ఒక్కటే ఉదాహరణ కాదు.

ఇంకో వీడియోలో ఒక కుక్క ఒక చిన్నారిని కాపాడుతూ కనిపించింది.ఆ పాప గదిలోంచి బయటికి ప్రాకుతూ వెళ్తుంటే, ఈ కుక్క దాన్ని ఫాలో అవుతూ, తల్లిని ఫన్నీగా చూస్తూ జడ్జ్ చేస్తోంది.“మా పాప తలుపు తెరువడం నేర్చుకుంది.దాన్ని కాపాడటానికి మా కుక్క ఎలా పరిగెడుతుందో, నన్ను ఎలా చూస్తుందో చూడండి” అంటూ ఆ వీడియోని టిక్‌టాక్‌లో షేర్ చేశారు.

ప్రస్తుత వైరల్ వీడియో చూస్తే మీరూ ఫిదా అయిపోతారు, ఇంకెందుకు ఆలస్యం, మీరూ ఓ లుక్ వేయండి!

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube