అంతర్జాతీయ క్రికెట్‌కు రవిచంద్రన్ అశ్విన్‌ వీడ్కోలు!

టాలెంటెడ్ టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్( Ravichandran Ashwin ) గురించి క్రీడాభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తమిళనాడులో 1986 సెప్టెంబర్ 17న జన్మించిన రవిచంద్రన్ అశ్విన్, కుడి చేతి వాటం కలిగిన భాట్స్ మెన్ మాత్రమే కాకుండా… ఆఫ్ స్పిన్ బౌలింగ్( Off-Spin Bowling ) కూడా అద్భుతంగా చేయగలడు.

 Ravichandran Ashwin Retires From International Cricket Details, Ravichandran Ash-TeluguStop.com

ఇతడు మొదట ఐపిఎల్ లో పూణే జట్టుకి ఎంపికయ్యాడు.ఈ క్రమంలో భారతదేశం తరుపున టెస్ట్ క్రికెట్లో అతి వేగంగా 50, 100, 150 వికెట్లు సాధించిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు.

Telugu Gabba, Indiaspremier, Ashwin, Spinbowler-Latest News - Telugu

విషయంలోకి వెళితే… రవిచంద్రన్ అశ్విన్‌ తాజాగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.గబ్బా టెస్టు ముగిసిన వెంటనే అశ్విన్ రిటైర్మెంట్( Ravichandran Ashwin Retirement ) ప్రకటించడం కొసమెరుపు.భారత టెస్టు చరిత్రలో అత్యంత విజయవంతమైన బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ ఒకడిగా పేరు ప్రఖ్యాతలు గడించాడు.గబ్బా టెస్టు( Gabba Test ) సందర్భంగా అశ్విన్ టీమిండియా ఆటగాళ్లను కౌగిలించుకుంటూ కనిపించడం విశేషం.

కాగా అడిలైడ్ టెస్టు తరువాత అతను గబ్బా టెస్టుకు దూరం జరిగిన సంగతి అందరికీ తెలిసినదే.తన రిటర్మెంట్ ని ప్రకటిస్తూ.కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని కౌగిలించుకున్నాడు.అశ్విన్ కూడా హెడ్ కోచ్ గంభీర్‌తో చాలాసేపు మాట్లాడి, ఆపై విలేకరుల సమావేశానికి వచ్చి రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు.

Telugu Gabba, Indiaspremier, Ashwin, Spinbowler-Latest News - Telugu

అశ్విన్ గురించి మాట్లాడుకుంటే పేజీలు సరిపోవు.ఇతగాడు టెస్టు క్రికెట్‌లో 106 మ్యాచ్‌లు ఆడి 537 వికెట్లు తీశాడు.అదేవిధంగా వన్డేల్లో 156 వికెట్లు పడగొట్టాడు.ఇక టీ20 విషయానికొస్తే.అశ్విన్ దాదాపు 72 వికెట్లు తీశాడు.అతను మొత్తంగా తన అంతర్జాతీయ కెరీర్‌లో 765 వికెట్లు సాధించాడు.

అదేవిధంగా బ్యాట్స్‌మెన్‌గానూ అశ్విన్ తనదైన ముద్ర వేయడం విశేషం.టెస్ట్ క్రికెట్‌లో 3503 పరుగులు చేసి రికార్డు సాధించాడు.

అతను మొత్తం 6 టెస్ట్ సెంచరీలు అడగా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మొత్తం 8 సెంచరీలు చేశాడు.రికార్డులతో పాటు 2011లో వన్డే ప్రపంచకప్‌ గెలిచిన జట్టులో భాగస్వామ్యం అయ్యాడు కూడా.

అలాగే, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీతోపాటు ఆసియా కప్‌ను కూడా అశ్విన్ గెలుచుకున్నాడు.టెస్టుల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులను కూడా అశ్విన్ గెలుచుకున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube