ఇక ఇప్పటి వరకు తమిళ్ సినిమా ఇండస్ట్రీలో( Tamil film industry ) రజనీకాంత్ , కమల్ హాసన్ ( Rajinikanth, Kamal Haasan )లు చాలా మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా వాళ్ళకంటూ సపరేట్ గా ఒక ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకున్నారు.ఇక ఇదిలా ఉంటే కమల్ హాసన్ ప్రస్తుతం భారతీయుడు 3( Bharatiyadu 3 ) సినిమాతోపాటు మణిరత్నం డైరెక్షన్ లో తగ్ లైఫ్ అనే సినిమా చేస్తున్నాడు.
మరి ఈ రెండు సినిమాలతో భారీ సక్సెస్ లను సాధించి తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది.

ఇక ఈ సంవత్సరం భారీ అంచనాలతో వచ్చిన భారతీయుడు 2( Bharatiyadu 3 ) సినిమా ఆశించిన మేరకు విజయాన్నైతే సాధించలేదు.దాంతో కమల్ హాసన్ ఇమేజ్ చాలావరకు డ్యామేజ్ అయింది.శంకర్ మీద నమ్మకంతో ఆ సినిమా చేసినప్పటికీ అది ఎలాంటి ప్రయోజనాన్ని చేకూర్చలేదు.కాబట్టి ఇకమీదట చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.‘భారతీయుడు 3’ సినిమా స్టోరీ అద్భుతంగా ఉండటమే కాకుండా అందులో ఆయన నటించడానికి కూడా చాలా ఎక్కువ స్కోప్ దొరికిందట.

అందువల్లే ఆ సినిమాను చేయడానికి తను ఆసక్తి చూపించినట్టుగా తెలుస్తోంది.మరి ఈ సినిమాతో ఎలాగైనా సరే మరోసారి పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేయాలని చూస్తున్నాడు.ఇక దాంతో పాటుగా ఆయన ప్రొడ్యూసర్ గా కూడా మారిన విషయం మనకు తెలిసిందే.ఇప్పటికే విక్రమ్ సినిమాతో అటు హీరోగా ఇటు ప్రొడ్యూసర్ గా రాణించిన ఆయన రీసెంట్ గా వచ్చిన అమరన్ సినిమాతో మరోసారి మంచి విజయాన్ని సాధించాడు…ఇక ఈ సినిమాకి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా కొనసాగడమే కాకుండా ఈ సినిమా సక్సెస్ సాధించడంతో ఆయన బ్యానర్ కూడా చాలా మంచి గుర్తింపును సంపాదించుకుంది…
.