కోవిడ్ తర్వాత అందరికీ ఆరోగ్యం పై కాస్త శ్రద్ధ పెరిగింది అని చెప్పాలి.ఎందుకంటే జంక్ ఫుడ్ ను ప్రజలు కాస్త దూరంగానే పెడుతున్నారు.
ఇంకా చెప్పాలంటే కొంతమంది ప్రజలు ప్రతిరోజు వ్యాయామాలు కూడా చేస్తున్నారు.అయితే ప్రకృతి వైద్యులు చెప్పే చిట్కాలను యువత పాటిస్తున్నారు.
వంటింటి చిట్కాలతోనే ప్రకృతి వైద్యులు చెప్పే రెమెడీస్ యువతను బాగా ఆకట్టుకుంటున్నాయి.
రక్తనాళాల్లో పేరుకు పోయే కొవ్వు, చెడు కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం.
ముఖ్యంగా చెప్పాలంటే గుండెలో, మెదడులో ఇలా కొవ్వు, కొలెస్ట్రాల్ చేరితే గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది.అలాంటి కొవ్వు, బ్యాడ్ కొలెస్ట్రాల్ ను మటుమాయం చేసేందుకు ప్రకృతి వైద్యులు ఒక రెమెడీని చెప్పారు.
ఆ రెమిడీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా రక్తనాళాలలో కొవ్వు లేదా కొలెస్ట్రాల్ పేరుకోకుండా ఉండడానికి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ ఎంతో బాగా ఉపయోగపడుతుంది.
ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది.అవిసె గింజల్లో ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ అనే మంచి కొవ్వు కూడా ఉంటుంది.
ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.దాదాపు 27 పరిశోధనలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి.
30 రోజుల పాటు రోజూ 25 నుంచి 30 గ్రాములు అవిసే గింజల్ని తింటే హార్ట్ స్టోక్, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం నెల రోజుల్లోనే 15 % వరకు తగ్గినట్లు రుజువైందని పరిశోధకులు చెబుతున్నారు.అంతేకాకుండా గుండె జబ్బులు వచ్చి స్టంట్స్, బైపాస్ ఆపరేషన్స్ చేయించుకున్న వారు లేదా బ్లాక్స్ వచ్చిన వారు కూడా ఈ అవిసే గింజల్ని రోజుకు 25 గ్రాములు తీసుకుంటే భవిష్యత్తులో వారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉండదు.
ముందుగా అవిసె గింజల్ని మాడకుండా దోరగా వేయించి పక్కన ఉంచాలి.ఆ తర్వాత గింజలు తీసిన ఖర్జూరం ముక్కలను తీసుకొని దానిలో కొంత తేనే కలిపి స్టవ్ పై పెట్టి రెండు నిమిషాలు వేడి చేయాలి.ఆ తర్వాత దోరగా ఉన్న అవిసె గింజల్ని అందులో కలిపి లడ్డూలుగా చేసుకోవాలి.అలా రోజు ఒక అవిసె లడ్డును తింటే పైన చెప్పిన ఆరోగ్య సమస్యలు ఏవి ఉండవు.