మామూలుగా పెళ్లయిన ఆడవాళ్లు సుమంగళిగా ఉంటారు.ఇక భర్త మరణించాక తాళిబొట్టుకు, కుంకుమ బొట్టుకు దూరంగా ఉంటారు.
ఇతర దేశాలలో సాంప్రదాయాలు ఎలా ఉంటాయో తెలియదు మన దేశంలో మాత్రం కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి.భర్త మరణించాక ఆ స్త్రీ పాపిట్లో కుంకుమ బొట్టు కానీ, తాళిబొట్టు కానీ ధరించరు.ఇప్పటికి ఇటువంటి సాంప్రదాయం నడుస్తూనే ఉంది.కానీ కొందరు మాత్రం ఈ సాంప్రదాయాలను పక్కకు పెట్టేశారు.ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళల్లో మాత్రం కొందరు తమ భర్త చనిపోయాక కూడా మెడలో నల్లపూసలు ధరించడం, నుదుట బొట్టు పెట్టుకోవడం వంటివి చేస్తున్నారు.
కానీ కొంతమంది నటీమణులు రియల్ లైఫ్ లో భర్త చనిపోయి ఉన్నా కూడా.
సినిమాలలో పాత్ర పరంగా ముత్తయిదుగా కనిపించడానికి ఇష్టపడరు.ఎందుకంటే ఆచారాలు అలా ఉంటాయి కాబట్టి.
కానీ ఈ మధ్య కొందరు ఆర్టిస్టులు రియల్ లైఫ్ లో భర్త మరణించిన కూడా రీల్ లైఫ్ లో ముత్తైదు పాత్ర చేయడానికి ఇష్టపడుతున్నారు.దీనివల్ల జనాలు వారిని సంప్రదాయాలు మర్చిపోయారు అంటూ దూషిస్తున్నారు.
అటువంటి మాటలే ఇప్పుడు సురేఖ వాణి కూడా ఎదుర్కొంటుంది.
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఆర్టిస్ట్ సురేఖ వాణి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.చాలా సినిమాలలో సహాయక పాత్రలలో చేసిన సురేఖవాణి నటిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది.ఇక ఈమె నటిగా ప్రేక్షకులను మెప్పించినప్పటికీ కూడా వారిని అభిమానులుగా మార్చుకోలేకపోయింది.
కానీ ఎప్పుడైతే సోషల్ మీడియాలో అడుగు పెట్టిందో అప్పటినుంచి తనకంటూ ఒక ఫ్యాన్ పేజీ కూడా ఉంది.
గత కొంతకాలం నుండి సురేఖ వాణి సోషల్ మీడియాకు బాగా అలవాటు పడింది.
ఈమెకు పెళ్లయి తన ఎత్తు కూతురు కూడా ఉండగా కొంతకాలం కిందట తన భర్త మరణించాడు.ఇక అప్పటినుంచి సురేఖ వాణి బయట ప్రపంచానికి పరిచయమైంది.
అంటే అప్పటి నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారింది.ఆ సమయంలో ఈమె రెండో పెళ్లి చేసుకుంటుందని కూడా వార్తలు బాగా వినిపించాయి.
దీంతో తన తల్లిపై వచ్చిన పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టడానికి వచ్చింది సుప్రీత.అప్పటినుంచి సుప్రీత కూడా అందరి దృష్టిలో పడింది.అలా తల్లి కూతుర్లు ఇద్దరు అప్పటినుండి ఇప్పటివరకు సోషల్ మీడియాలలో బాగా రచ్చ రచ్చ చేశారు.నిజానికి వీరి రచ్చ చూస్తే మాత్రం షాక్ అవ్వకుండా ఉండలేరు.
పొట్టి పొట్టి బట్టలు వేస్తూ బాగా రెచ్చిపోతూ ఉంటారు.సుప్రీత విషయాన్ని పక్కకు పెడితే.
సురేఖ వాణి మాత్రం బాగా మారిపోయింది.
ఒకప్పుడు పద్దతిగా ఉండే ఈమె ఇప్పుడు మాత్రం బాగా రెచ్చిపోయింది.పొట్టి పొట్టి బట్టలు వేస్తూ ఏమాత్రం తగ్గకుండా గ్లామర్ షో చేస్తుంది.భర్త చనిపోయిన కూడా ఈమె ఈ విధంగా గ్లామర్ షో చేయటంతో చాలామంది ఈమెను విమర్శించారు కూడా.
అయినప్పటికి ఈమె మాత్రం అస్సలు తగ్గట్లేదు.అంతేకాకుండా ఇప్పటికీ నల్లపూసలు కూడా ధరిస్తూనే, ఎర్ర బొట్టు పెట్టుకుంటూ కనిపిస్తూ ఉంటుంది.
నిజానికి ఈమె మన తెలుగు సాంప్రదాయానికి చెందిన నటి.కానీ ఆచారాలు మర్చిపోయి ఆమె అలా బొట్టు, నల్లపూసలు ధరించడంతో బాగా విమర్శలు కూడా చేశారు.
అయితే తాజాగా తను ఒక వీడియో పంచుకుంది.అందులో తను షూటింగ్ బిజీలో ఉండగా.సెట్ లో వీడియో తీస్తూ కనిపించింది.ఆమె అందులో చీర కట్టుకొని మెడలో పసుపు తాడు, నల్లపుస్తే, పాపిట్లో బొట్టు పెట్టుకొని కనిపించింది.
ఇక దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ ప్రస్తుతం బాగా వైరల్ అవ్వగా.ఆమెను అలా చూసి అందరూ ట్రోల్ చేయటం మొదలుపెట్టారు.
భర్త చనిపోయాక మళ్లీ బొట్టు, మెడలో మంగళసూత్రం ధరించే హక్కు ఏ స్త్రీకి ఉండదు అని.అటువంటిది నువ్వు.సినిమాలో కూడా అటువంటి క్యారెక్టర్ చేస్తున్నావు అంటే మిమ్మల్ని ఏమనాలి అంటూ ఫైర్ అవుతున్నారు.