టాలీవుడ్ హీరోయిన్ మహానటి కీర్తి సురేష్( Keerthy Suresh ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలోనే మంచి మంచి సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.
మహానటి( Mahanati ) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువ అవడంతో పాటు రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్గా మారిపోయింది.పేరుకే మలయాళీ హీరోయిన్ అయినప్పటికీ టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇకపోతే ఇటీవలే అభిమానుల గుండెల్లో తుపాకీ పేలుస్తూ ఊహించిన విధంగా ఆంటోని తట్టిళ్( Antony Thattil ) అనే బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
మరోవైపు ఈమె నటించిన తొలి హిందీ సినిమా బేబీ జాన్( Baby John Movie ) క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ కానుంది.ఇప్పుడు ఈ మూవీ కోసం డబుల్ రెమ్యునరేషన్ తీసుకుందనే టాక్ నడుస్తోంది.అయితే బేబీ జాన్ మూవీని తమిళ సినిమా తెరి సినిమాకు రీమేక్ గా తెరకెక్కించిన విషయం తెలిసిందే.
ఒరిజినల్ సినిమాలో సమంత కనిపించిన పాత్రలో ఇప్పుడు కీర్తి సురేశ్ నటించింది.సౌత్‌లో నటిస్తే రూ.2 కోట్లు ఈమెకు ఇస్తారు.కానీ బేబీ జాన్ లో నటించినందుకు గానూ రూ.4 కోట్లు పైనే పారితోషికం ఇచ్చారట.బహుశా అందుకేనేమో గ్లామర్ విషయంలోనూ తగ్గేదే లే అన్నట్లు పాటల్లో కనిపించింది.
అయితే ఇప్పుడు పెళ్లి తర్వాత ఈమె సినిమాలలో కంటిన్యూ అవుతుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఇప్పుడు కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన బేబీ జాన్ మూవీ సక్సెస్ అయితే ఈ ముద్దుగుమ్మకు మరిన్ని అవకాశాలు క్యూ కట్టడం ఖాయం అని తెలుస్తోంది.ప్రస్తుతం మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో బిజీ బిజీగా ఉన్నారు.కానీ ఇటీవల మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన కీర్తి సురేష్ మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది.
ఇటీవలే ఆమె క్రిస్టియన్ పద్ధతిలో కూడా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం పెళ్లి సందడిలోనే ఉంది కీర్తి సురేష్.