వైరల్ వీడియో: నిల్చొని పనిచేయండి అంటూ ఉద్యోగులకు సీఈవో పనిష్మెంట్..

ప్రస్తుత రోజులలో ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ప్రైవేటు సంస్థ ఉద్యోగులు కానీ ప్రవర్తించే తీరును చూస్తే చాలా మంది ఆశ్చర్యపోతారు.కొంత మంది ఉద్యోగుల ప్రవర్తన చూసి చాలా మంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు.

 Noida Authority Officials Punished For Neglecting Elderly Couple Forced To Stand-TeluguStop.com

ఒక వృద్ధ జంట( Elderly Couple ) ఎదుర్కొన్న ఇబ్బందికి తగ్గట్టు ఆ సంస్థకు సంబంధించిన సీఈవో ఉద్యోగులకు ఇచ్చిన శిక్షను చూసి నెటిజన్స్ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాలలోకి వెళ్తే.

నోయిడా అథారిటీ( Noida Authority ) ఆఫీస్ కు లోకేష్( Lokesh ) అనే వ్యక్తి సీఈవోగా నియమితులయ్యారు.

ఈ క్రమంలో ఒక ఇంటికి సంబంధించిన విషయంపై ఒక వృద్ధ జంట ఆఫీసుకు వచ్చారు.ఇటీవల ఆ వృద్ధ జంట ఆఫీసుకు వెళ్లి తమ ఫైలు ముందుకు కదిలేగా చూడాలని తమ ఫైలు అప్రూవ్ చేయాలని రిక్వెస్ట్ చేసుకున్నారు.కానీ, వాళ్ళని దాదాపు గంట పాటు రెసిడెన్షియల్ ప్లాట్ డిపార్ట్మెంట్లోని ప్రతి ఉద్యోగి వాళ్లను పట్టించుకోలేదు.

ఈ విషయం కాస్త చివరకు సీఈవో లోకేష్ వద్దకు వెళ్ళగా ఉద్యోగులకు తగిన గుణ పాఠం చెప్పాడు.నిజ నిర్ధారణ కోసం సంఘటనకు సంబంధించి సీసీ ఫుటేజ్ ను పరిశీలన చేసి ఆ వృద్ధ దంపతులు అంతసేపు నిరీక్షిస్తున్న దృశ్యాలను కూడా చూసి లోకేష్ చలించిపోయాడు.

దీంతో ఉద్యోగుల నిర్లక్ష్యంపై సీఈఓ ఫైర్ అయ్యి ప్రతి ఉద్యోగి అరగంట పాటు వాళ్ళ చైర్ లో నుంచి నించొని పనిచేయాలని ఆదేశాలు జారీ చేశాడు.ప్రస్తుతం ఉద్యోగులు నిల్చోని పనిచేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.ఇక ఈ వీడియోని చూసిన నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.కొంతమంది సీఈఓ విధించిన శిక్షకు సరైన గుణపాఠం చెప్పారని అభిప్రాయం తెలియజేస్తూ ఉంటే మరికొందరు ఇలాంటి ఉద్యోగులను మరింత కఠినంగా శిక్షించాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube