డార్క్ సర్కిల్స్ (కళ్ల కింద నల్లటి వలయాలు). ఎందరినో వేధిస్తున్న సమస్య ఇది.
ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా కనిపిస్తుంటుంది.ఆహారపు అలవాట్లు, మారిన జీవన శైలి, శరీరంలో అధిక వేడి, పోషకాల లోపం, ఒత్తిడి, హార్మోన్ చేంజస్, పలు రకాల మందుల వాడకం, నిద్ర లేమి, అధికంగా స్మార్ట్‌ఫోన్ వాడటం ఇలా రకరకాల కారణాల వల్ల డార్క్ సర్కిల్స్ ఏర్పడుతుంటాయి.
వీటిని తగ్గుంచుకోకుంటే.ముఖం కాంతిహీనంగా కనిపిస్తుంది.అందుకే ఈ సమస్యను తగ్గించుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంటారు.
అయితే డార్క్ సర్కిల్స్ తో బాధ పడే వారికి అవిసె గింజల నూనె అద్భుతంగా సహాయపడుతుంది.
అవిసె గింజల నూనెలో ఉండే కొన్ని ప్రత్యేకమైన పోషకాలు నల్లటి వలయాలను నివారించడంలో గ్రేట్‌గా సమాయపడతాయి.మరి అవిసె గింజల నూనెను ఎలా యూజ్ చేయాలో లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ముందు అవిసె గింజల నూనెను చేతిలోకి తీసుకుని.కళ్ల కింద అప్లై చేసుకోవాలి.ఆ తర్వాత వేళ్లతో మెల్ల మెల్లగా సర్కిలర్ మోషన్‌లో కాసేపు మసాజ్ చేసుకుని.బాగా డ్రై అయిన తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా రోజుకు ఒక సారి చేస్తూ ఉంటే.డార్క్ సర్కిల్స్ క్రమంగా తగ్గు ముఖం పడతాయి.
అలాగే ఒక బౌల్ తీసుకుని.అందులో ఒక స్పూన్ అవిసె గింజల నూనె, ఒక స్పూన్ బాదం నూనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కళ్ల కింద పూసి.నాలుగైదు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.అనంతరం గోరు వెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి.రెగ్యులర్‌గా ఇలా చేసినా కూడా నల్లటి వలయాలు క్రమంగా మటుమాయంఅవుతాయి.
కళ్ళు అందంగా, కాంతి వంతంగా మెరుస్తాయి.