మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.ఆచార్య తర్వాత లూసిఫర్ రీమేక్, కె.
ఎస్ రవీంద్ర సినిమాలను చేస్తున్న చిరు ఈ సినిమా తర్వాత మారుతి డైరక్షన్ లో కూడా సినిమా చేసే ప్లాన్ లో ఉన్నట్టు టాక్.ఇక లేటెస్ట్ గా స్టార్ కొరియోగ్రాఫర్, యాక్టర్ కమ్ డైరక్టర్ ప్రభుదేవా డైరక్షన్ లో కూడా చిరు సినిమా ఉంటుందని చెబుతున్నారు.
చిరుతో ఆల్రెడీ శంకర్ దాదా జిందాబాద్ సినిమా చేశాడు ప్రభుదేవా ఆ సినిమా ప్రేక్షకులను మెప్పించలేదు.ఆ టైం లోనే ప్రభుదేవాతో మరో సినిమా చేయాలని చిరు అనుకున్నారట.
ఈమధ్య ప్రభుదేవా చిరుని కలవడం సినిమా గురించి మాట్లాడటం జరిగిందట.
చిరు కోసం ప్రభుదేవా ఒక మంచి కథ చెప్పినట్టు టాక్.
బాలీవుడ్, కోలీవుడ్ లో డైరక్టర్ దూసుకెళ్తున్న ప్రభుదేవా తెలుగులో చాలా గ్యాప్ తర్వాత చిరుతో సినిమా చేయాలని చూస్తున్నారు.ఈ కాంబో ఫిక్స్ అయితే నిజంగానే మెగా ఫ్యాన్స్ కు పండుగే అని చెప్పొచ్చు.
డ్యాన్స్ మాస్టర్ గా చిరుతో అదిరిపోయే స్టెప్పులు వేయించిన ప్రభుదేవా డైరక్టర్ గా చిరుతో మరోసారి ఎలాంటి సినిమాతో వస్తారో చూడాలి.కథ ఫైనల్ అయితే ప్రభుదేవాతో చిరు సినిమా ఫిక్స్ అయినట్టే అని చెప్పుకుంటున్నారు.