స‌న్ ట్యాన్‌ను ఈజీగా నివారించే ఆవ‌నూనె..ఎలా వాడాలంటే?

స‌మ్మ‌ర్ సీజ‌న్ స్టార్ట్ అయిపోయింది.రోజు రోజుకు ఎండ‌లు ముదిరిపోతున్నాయి.

 Mustard Oil Helps To Get Rid Of Sun Tan! Mustard Oil, Sun Tan, Benefits Of Musta-TeluguStop.com

ఈ స‌మ్మ‌ర్ సీజ‌న్‌లో ప్ర‌ధానంగా వేధించే చ‌ర్మ స‌మ‌స్య‌ల్లో స‌న్ ట్యాన్ ఒక‌టి.కాసేపు అలా ఎండలో వెళ్లొస్తే చాలు.

చర్మం నల్లగా మారిపోతుంటుంది.సూర్యుని నుంచి వెలువడే కాంతిలోని యూవీ కిరణాలు చ‌ర్మంపై నేరుగా ప‌డ‌టం వ‌ల్ల క‌ణాలు డ్యామేజ్ అవుతాయి.

అందుకే ఈ స‌న్ ట్యాన్ స‌మ‌స్య ఏర్ప‌డుతుంది.ఇక ఈ స‌మ‌స్య‌ను నివారించుకునేందుకు క్రీములు, లోష‌న్లు, ఆయిల్స్ ఇలా ఎన్నో రాస్తుంటారు.

కానీ, న్యాచుర‌ల్‌గానే స‌న్ ట్యాన్ స‌మ‌స్య‌ను ఈజీగా నివారించుకోవ‌చ్చు.ముఖ్యంగా స‌న్ ట్యాన్ స‌మ‌స్య‌కు చెక్ పెట్ట‌డంలో ఆవనూనె అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.మ‌రి చ‌ర్మానికి ఆవ‌నూనె ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.ముందు ఒక బౌల్‌లో ఆవ‌నూనె మ‌రియు రోజ్ వాట‌ర్ స‌మానంగా తీసుకుని మిక్స్ చేయాలి.

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని చ‌ర్మానికి అప్లై చేసి.ఐదు నిమిషాల పాటు మ‌సాజ్ చేసుకోవాలి.

ఇర‌వై నిమిషాల త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా రెగ్యుల‌ర్‌గా చేస్తే క్ర‌మంగా ట్యానింగ్ స‌మ‌స్య దూరం అవుతుంది.

అలాగే బీట్ రూట్‌ను ఎండ‌బెట్టి పొడి చేసుకోవాలి.ఇప్పుడు ఆవ నూనెలో బీట్ రూట్ పొడి క‌లిపి ట్యాన్ అయిన ప్రాంతంలో అప్లై చేయాలి.బాగా డ్రై అయిన త‌ర్వాత నీళ్లు జ‌ల్లి మెల్ల మెల్ల‌గా రుద్దుతూ శుభ్రం చేసుకోవాలి.ఇలా రెండు రోజుల‌కు ఒకసారి చేస్తే.చ‌ర్మం మ‌ళ్లీ తాజాగా, అందంగా మారుతుంది.

ఇక ఆవ‌నూనె ఒక స్పూన్‌, నిమ్మ ర‌సం ఒక స్పూన్ తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్ర‌మాన్ని చ‌ర్మానికి అప్లై చేసి.అర గంట పాటు వ‌దిలేయాలి.

ఆ త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో చ‌ర్మాన్ని శుభ్రం చేసుకోవాలి.ఇలా చేసినా స‌న్ ట్యాన్ స‌మ‌స్య త‌గ్గు ముఖం ప‌డుతుంది.

చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది.

Mustard Oil Helps To Get Rid Of Sun Tan! Mustard Oil, Sun Tan, Benefits Of Mustard Oil, Latest News, Beauty Tips, Beauty, Skin Care, Mustard Oil For Face, Mustard Oil And Rose Water, Mustard Oil And Lemon, Beet Root - Telugu Tips, Beet Root, Latest, Mud Oil, Mud Oil Lemon, Mud Oil Rose, Mud Oil Face, Skin Care, Sun Tan #Shorts

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube