టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు,( Mahesh Babu ) స్టార్ డైరెక్టర్ రాజమౌళి( Rajamouli ) కాంబినేషన్లో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.ఈ సినిమా ఇంకా పట్టాలెక్కక ముందే ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు డైరెక్టర్ రాజమౌళి.మహేష్ బాబు కూడా అందుకు సంబంధించిన పనుల్లోనే బిజీ బిజీగా ఉన్నారు.
అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
అయితే ఇట్టకేలకు అభిమానులు సంతోషించే సమయం వచ్చేసింది.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఇది చక్కటి శుభవార్త అని చెప్పాలి.సంక్రాంతి పండుగ( Sankranti Festival ) తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నారట.ఇప్పటికే మహేష్ బాబు ఈ సినిమాకు డేట్లు కూడా ఇచ్చేసినట్టు తెలుస్తోంది.
జనవరి ద్వితీయార్థంలో ఈ సినిమాకు క్లాప్ కొట్టనున్నారు.ఇప్పటికే అందుకు తగిన ఏర్పాట్లు అన్నీ కూడా జరిగిపోయాయి.
అయితే నిజానికి రాజమౌళి స్క్రిప్ట్ విషయంలో ఇంకాస్త సమయం తీసుకోబోతున్నారని, ఏప్రిల్ వరకు షూటింగ్ మొదలు కాదు అని వార్తలు కూడా వినిపించాయి.దీంతో ఈ సినిమా పట్ల అభిమానులు కాస్త నిరాశ చెందుతున్న నేపథ్యంలో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఫుల్ ఖుషి అవుతున్నారు అభిమానులు.
ఈ సినిమా కోసం రామోజీ ఫిలిం సిటీ తో పాటు హైదరాబాద్ శివార్లలో కొన్ని భారీగా సెట్లు వేసినట్టు తెలుస్తోంది.ఈ సినిమా మొదటి షెడ్యూల్ మొత్తం హైదరాబాదులో జరగనుందట.ఏప్రిల్ వరకు ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరగనుందట.ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని మిగిలిన భాగాన్ని విదేశాల్లో చిత్రీకరించే అవకాశాలు ఉన్నట్టు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ సినిమాలో ఇప్పటివరకు కేవలం హీరో మహేష్ బాబు మాత్రమే ఫిక్స్ అయ్యారు.ఇంకా ఎవరెవరు నటిస్తున్నారు ఏంటి అన్న వివరాలు ఇంకా తెలియ రాలేదు.