ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాలు అత్యంత భారీ అంచనాలతో విడుదల కావడం సాధారణం అయింది.స్టార్ హీరోలు రెండేళ్లకు, మూడేళ్లకు ఒక సినిమాలో నటిస్తున్న నేపథ్యంలో భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై అంచనాలు పెరుగుతున్నాయి.
ప్రభాస్ కల్కితో( Kalki ) ఎన్టీఆర్ దేవరతో( Devara ) బన్నీ పుష్ప ది రూల్( Pushpa The Rule ) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్లు సాధించారు.టాలీవుడ్ స్టార్ హీరోలు భారీ ప్రాజెక్ట్ లతో భారీ విజయాలను సొంతం చేసుకున్నారు.
ఇప్పుడు రామ్ చరణ్( Ram Charan ) వంతు వచ్చింది.రామ్ చరణ్ గేమ్ ఛేంజర్( Game Changer ) సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.
గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతికి రిలీజ్ కావడం ఈ సినిమాకు ప్లస్ అవుతుండగా ఆ సమయానికి పుష్ప ది రూల్ హవా కూడా తగ్గుతుందనే సంగతి తెలిసిందే.గేమ్ ఛేంజర్ మొదట రిలీజ్ అవుతుండటం, శుక్రవారం రోజున రిలీజ్ అవుతుండటంతో ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో స్క్రీన్లు దక్కనున్నాయి.
జనవరి 12వ తేదీన డాకు మహారాజ్ ఆదివారం రోజున రిలీజ్ అవుతుండగా జనవరి 14వ తేదీన సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ కానుంది.దిల్ రాజు బ్యానర్ నుంచి రెండు సినిమాలు కొన్ని రోజుల గ్యాప్ లో థియేటర్లలో రిలీజ్ అవుతుండటం ఇదే తొలిసారి అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.గేమ్ ఛేంజర్ కు టాక్ పాజిటివ్ గా వస్తే మాత్రం కలెక్షన్ల విషయంలో అదరగొట్టడం పక్కా అని చెప్పవచ్చు.
శ్రీకాంత్ ఈ సినిమాలో వయస్సుకు మించిన పాత్రలో కనిపిస్తున్నారు.ఎస్జే సూర్య ఈ సినిమాలో విలన్ రోల్ లో కనిపిస్తున్నారనే సంగతి తెలిసిందే.గేమ్ ఛేంజర్ సినిమా కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడంతో పాటు సంచలనాలు సృష్టించే సినిమా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ హిట్ గా నిలవనుందో చూడాల్సి ఉంది.