సంధ్య థియేటర్ కు భారీ షాక్.. లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదంటూ?

హైదరాబాద్ లోని ప్రముఖ థియేటర్లలో సంధ్య థియేటర్ ( sandhya theatre ) ఒకటని చెప్పాల్సిన అవసరం లేదు.ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ( RTC Cross Roads )లోని సంధ్య థియేటర్ లో సినిమా చూడటానికి సినీ అభిమానులతో పాటు సెలబ్రిటీలు సైతం ఆసక్తి కనబరుస్తారు.

 Huge Shock To Sandhya Theatre Details Inside Goes Viral In Social Media , Soci-TeluguStop.com

అయితే సంధ్య థియేటర్ లో ఈ నెల 4వ తేదీన జరిగిన తొక్కిసలాట ఘటనను ఎవరూ మరిచిపోలేరు.ఈ ఘటన విషయంలో థియేటర్ నిర్వాహకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.

అయితే సంధ్య థియేటర్ నిర్వాహకులకు హైదరాబాద్ పోలీసులు షాకిచ్చారు.హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ( CP CV Anand )సంధ్య థియేటర్ కు షోకాజ్ నోటీసులు జారీ చేయడం గమనార్హం.

ఈ నెల 4వ తేదీన పుష్ప ది రూల్ మూవీ రిలీజ్ సందర్భంగా థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల జరిగిన ఘటనకు సంబంధించి లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలంటూ నోటీసులు జారీ చేశారు.

Telugu Theater, Cp Cv Anand, Shocksandhya, Rtc Cross Roads, Sandhya Theatre-Movi

ఈ నోటీసులకు సంబంధించి పది రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరారు.సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో భవిష్యత్తులో సెలబ్రిటీలు థియేటర్ లో సినిమా చూడాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.సంధ్య థియేటర్ నిర్వాహకులు ఈ నోటీస్ గురించి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

స్సంధ్య థియేటర్ నిర్వాహకులు సైతం భవిష్యత్తులో జాగ్రత్త వహించాల్సి ఉంది.

Telugu Theater, Cp Cv Anand, Shocksandhya, Rtc Cross Roads, Sandhya Theatre-Movi

భారీ బడ్జెట్ సినిమాల రిలీజ్ సమయంలో ఏ మాత్రం తప్పు చేసినా థియేటర్ నిర్వాహకులకు ఇబ్బందేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఇకపై పెద్ద సినిమాల బెనిఫిట్ షోలకు టికెట్లు దొరకడం కష్టమని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.మరోవైపు సంధ్య థియేటర్ వివాదం వల్ల బన్నీపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.

బన్నీ ఈ వివాదం నుంచి పూర్తిస్థాయిలో బయటపడతారో చూడాల్సి ఉంది.బన్నీని ఈ వివాదం తెగ టెన్షన్ పెడుతోందని సమాచారం అందుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube