కన్నడ సీరియల్ హీరో గా నటనా జీవితం మొదలుపెట్టి ఆ తర్వాత సినిమా పరిశ్రమలో హీరోగా అడుగుపెట్టి కేజీఎఫ్ వంటి సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో యష్.కే జి ఎఫ్ సినిమాకి ముందు కేవలం 3 నుంచి 4 కోట్ల పారితోషకం తీసుకునే యష్ ఆ తర్వాత 50 కోట్లకు పైగా పారితోషికం తీసుకునే హీరోగా ఎదిగాడు.
అయితే అదే స్థాయిలో తన దగ్గర ఆస్తులను కూడా పెట్టుకున్నాడు.ప్రస్తుతం హీరో యష్ వద్ద ఖరీదైన ఐదు కార్లు ఉండడం విశేషం.ఆ కార్లు ఏంటి ? వాటి ధర ఏంటో తెలుసుకుందాం పదండి.
మెర్సిడెస్ బెంజ్ GLS 350D
సాధారణంగా బెంజ్ కార్ అంటేనే ఎంత లగ్జరీ కార్.దాంట్లో GLS 350D కారు అంటే దాదాపు 85 లక్షల విలువ చేస్తుంది.దీంట్లో ఏడుగురు కూర్చునే సౌలభ్యం ఉంది.
మెర్సిడెస్ బెంజ్ GLS 250D కూపే
ఇక డెబ్బై ఎనిమిది లక్షల రూపాయల ఖరీదుతో ఐదుగురు కూర్చునే మెర్సిడెస్ GLC 250డి కూపే కార్ ని కూడా హీరో యష్ కలిగి ఉన్నాడు.దీంట్లో 9G ట్రోనిక్ టానిక్ టెక్నాలజీ వాడడం ఒక విశేషం.
![Telugu Audi, Benz Car, Bmw, Yash, Yash Cars, Yash Luxery Car, Luxery Car, Merced Telugu Audi, Benz Car, Bmw, Yash, Yash Cars, Yash Luxery Car, Luxery Car, Merced](https://telugustop.com/wp-content/uploads/2022/07/luxery-car-collection-BMW-520D-Audi-Q7.jpg)
రేంజ్ రోవర్ ఎవోక్యు
ఇక యష్ దగ్గర ఉన్న కార్ కలెక్షన్ లో మరొక అద్భుతమైన కార్ రేంజ్ రోవర్ ఎవోక్యు.ఎంత కంఫర్టబుల్ కారుగా పేరున్న ఈ రేంజ్ రోవర్ కార్ ఖరీదు దాదాపు 60 నుంచి 80 లక్షల వరకు ఉంటుంది.
![Telugu Audi, Benz Car, Bmw, Yash, Yash Cars, Yash Luxery Car, Luxery Car, Merced Telugu Audi, Benz Car, Bmw, Yash, Yash Cars, Yash Luxery Car, Luxery Car, Merced](https://telugustop.com/wp-content/uploads/2022/07/Hero-Yash-luxery-car-luxery-car.jpg)
ఆడి Q7
ప్రతి ఒక్కరికి ఎంతో డ్రీమ్ కార్ అయినటువంటి ఆడి కార్లు కూడా హీరో యష్ తన గ్యారేజ్ లో పెట్టుకున్నాడు.ఆడి క్యూ7 కార్ హై ఎండ్ వర్షన్ కారును 70 నుంచి 90 లక్షల రూపాయల ఖర్చుతో కొనుగోలు చేశాడు యష్.
![Telugu Audi, Benz Car, Bmw, Yash, Yash Cars, Yash Luxery Car, Luxery Car, Merced Telugu Audi, Benz Car, Bmw, Yash, Yash Cars, Yash Luxery Car, Luxery Car, Merced](https://telugustop.com/wp-content/uploads/2022/07/luxery-car-collection-BMW-520D-Audi.jpg)
BMW 520 D
యష్ కార్ కలెక్షన్ లో మరొక క్లాసిక్ కార్ బిఎండబ్ల్యూ 520D. చాలామంది సెలబ్రిటీస్ బిఎండబ్ల్యూ కార్ ని కలిగి ఉంటారు అయితే ఈ కారు ఖరీదు 65 లక్షల వరకు ఉంది.