బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్న తర్వాత అషు రెడ్డి క్రేజ్ బాగా పాపులర్ అయ్యింది.సోషల్ మీడియాలో అషు రెడ్డి ఎంత దూసుకుపోతుందో అందరికీ తెలిసిందే.
ఇక ఎప్పటికప్పుడు తన ఫోటోలను, వీడియోలను తీసి నెట్టింట్లో తెగ షేర్ చేస్తుంది.మొత్తానికి అషు రెడ్డి ఓ సెలబ్రిటీ గా పేరు సంపాదించుకుంది.
అషు రెడ్డి సోషల్ మీడియాలో అడుగు పెట్టిన తర్వాతే బుల్లితెరపై పరిచయం అయింది.ఆమె మొదట్లో సోషల్ మీడియాలో డబ్ స్మాష్ వీడియోలతో బాగా ఫేమస్ అయింది.
చూడటానికి సమంతలా ఉన్న అషు రెడ్డి కు బాగా ఫాలోయింగ్ పెరిగింది.అతి తక్కువ సమయంలో తన కెరీర్ మొత్తం మారిపోయింది.
ఇక సినిమాల్లో నటించాలని ఆసక్తి కూడా కలుగగా చల్ మోహన్ రంగా సినిమాలో ఒక పాత్రలో నటించింది.
ఇక ఆమెకు పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ఇష్టమని పలుమార్లు చెప్పుకొచ్చింది.
అతనిపై ఉన్న ఇష్టం, అభిమానం తనకు పీకల మీద ఉండటంతోపాటు ప్రైవేట్ పార్టులో ఆయన పేరుతో ఉన్న టాటూలను వేసుకోవడమే కాకుండా చూపించింది కూడా.ఆ మధ్య ఆయన తో దిగిన ఫోటోలను కూడా షేర్ చేస్తూ.
ఆయనతో నటించాలని కోరిక కూడా ఉందని తెలిపింది.
ఇక ఈ ముద్దుగుమ్మ బుల్లితెరపై ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.
పైగా ఇటీవలే పూర్తయిన బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కూడా అవకాశం అందుకొని మరింత క్రేజ్ సంపాదించుకుంది.ఈ బ్యూటీ తన గ్లామర్ తో మాత్రం కుర్రాళ్ళను పిచ్చెక్కించింది.
నిజానికి ఈ బ్యూటీ ఇంట్లో కంటే ఎక్కువగా నెట్టింట్లో గడుపుతుంది.

ఈమె గతంలో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.వీరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని అప్పట్లో తెగ పుకార్లు కూడా వచ్చాయి.ఇక బుల్లితెరలో ప్రసారమైన కామెడీ స్టార్ అనే కామెడీ షోలో లేడీ కమెడియన్ గా అడుగు పెట్టి తన కామెడీతో ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.
ఇక అక్కడ కూడా మరో కమెడియన్ ఎక్స్ప్రెస్ హరితో బాగా రెచ్చిపోయింది.ఏకంగా ముద్దులు పెట్టి, హగ్ లు ఇచ్చి అందరి దృష్టిలో పడింది.ఆ తర్వాత యాంకర్ రవి తో కలిసి ఓ షోలో యాంకర్ గా కూడా చేసి బాగా రెచ్చిపోయింది.
అంతలోనే ఓటీటీలో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ లో అవకాశం అందుకుంది.
ఇక ఇందులో కూడా అషు మరింత క్రేజ్ సంపాదించుకుంది.ఇక ఇందులో మరో కంటెస్టెంట్ అజయ్ తో బాగా రచ్చ చేసింది.
నిజానికి రెండుసార్లు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టింది అంటే తర్వాత తన పొజిషన్ ఏంటో క్లియర్ గా అర్ధం అవుతుంది.ఇక బిగ్ బాస్ తర్వాత మళ్లీ నెట్టింట్లో తన రచ్చ మొదలు పెట్టింది.
ప్రతి రోజు ఫోటోలు షేర్ చేసుకుంటూ తెగ లైకులు సంపాదించుకుంటుంది.

అప్పుడప్పుడు ఈమె చేసే పోస్టులను చూసి నెటిజన్లు దారుణమైన ట్రోల్స్, కామెంట్లు పెడుతూ ఉంటారు.ఇదిలా ఉంటే ఇటీవలే తాను షేర్ చేసుకున్న పోస్ట్ కు కూడా బాగా కామెంట్లు వస్తున్నాయి.ఇటీవలే తాను తన ఇన్ స్టా వేదికగా తన బాడీ మీద ఉన్న పవన్ టాటూ ను షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇక ఆయనే తన ఫస్ట్ లవ్ అని చెప్పుకోగా దీనికి నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.నువ్వు సినిమాలో అవకాశాల కోసం పవన్ కళ్యాణ్ ను బాగా వాడుకుంటున్నావు అని.నువ్వు ఎంత కాకా పట్టిన నీకు అవకాశాలు రావు అంటూ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.








