సంధ్య థియేటర్ కు భారీ షాక్.. లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదంటూ?

హైదరాబాద్ లోని ప్రముఖ థియేటర్లలో సంధ్య థియేటర్ ( Sandhya Theatre ) ఒకటని చెప్పాల్సిన అవసరం లేదు.

ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ( RTC Cross Roads )లోని సంధ్య థియేటర్ లో సినిమా చూడటానికి సినీ అభిమానులతో పాటు సెలబ్రిటీలు సైతం ఆసక్తి కనబరుస్తారు.

అయితే సంధ్య థియేటర్ లో ఈ నెల 4వ తేదీన జరిగిన తొక్కిసలాట ఘటనను ఎవరూ మరిచిపోలేరు.

ఈ ఘటన విషయంలో థియేటర్ నిర్వాహకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.అయితే సంధ్య థియేటర్ నిర్వాహకులకు హైదరాబాద్ పోలీసులు షాకిచ్చారు.

హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ( CP CV Anand )సంధ్య థియేటర్ కు షోకాజ్ నోటీసులు జారీ చేయడం గమనార్హం.

ఈ నెల 4వ తేదీన పుష్ప ది రూల్ మూవీ రిలీజ్ సందర్భంగా థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల జరిగిన ఘటనకు సంబంధించి లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలంటూ నోటీసులు జారీ చేశారు.

"""/" / ఈ నోటీసులకు సంబంధించి పది రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరారు.

సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో భవిష్యత్తులో సెలబ్రిటీలు థియేటర్ లో సినిమా చూడాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.

సంధ్య థియేటర్ నిర్వాహకులు ఈ నోటీస్ గురించి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

స్సంధ్య థియేటర్ నిర్వాహకులు సైతం భవిష్యత్తులో జాగ్రత్త వహించాల్సి ఉంది. """/" / భారీ బడ్జెట్ సినిమాల రిలీజ్ సమయంలో ఏ మాత్రం తప్పు చేసినా థియేటర్ నిర్వాహకులకు ఇబ్బందేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఇకపై పెద్ద సినిమాల బెనిఫిట్ షోలకు టికెట్లు దొరకడం కష్టమని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

మరోవైపు సంధ్య థియేటర్ వివాదం వల్ల బన్నీపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.

బన్నీ ఈ వివాదం నుంచి పూర్తిస్థాయిలో బయటపడతారో చూడాల్సి ఉంది.బన్నీని ఈ వివాదం తెగ టెన్షన్ పెడుతోందని సమాచారం అందుతోంది.

పుష్ప2 మూవీ వల్ల ట్రాఫిక్ జామ్.. ఇతర రాష్ట్రాల్లో బన్నీ క్రేజ్ మామూలుగా లేదుగా!