ఇప్పటివరకు చాలామంది సినిమా దర్శకులు వాళ్లకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే వస్తున్నారు.కానీ వాళ్లు చేసే ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ ని సాధిస్తుందనే నమ్మకం అయితే లేకుండా పోతుంది.
ఇక దర్శక ధీరుడు రాజమౌళి( Rajamouli ) చేసిన ప్రతి సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తూ రావడంతో అందరూ అతన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మంచి సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.కానీ ఆ సినిమాలేవి పెద్దగా సక్సెస్ లను సాధించకపోగా చాలా వరకు నష్టాలను కూడా తెచ్చిపెడుతున్నాయి.

ఇక ప్రస్తుతం రాజమౌళి పాన్ వరల్డ్ సినిమా( Pan World Movie ) చేస్తున్నాడు.మరి ఈ సినిమాతో ఎలాంటి మ్యాజిక్ ను చేస్తాడనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది.ఇక ఇప్పటికే ఈ సినిమా కోసం 1300 కోట్ల బడ్జెట్ ని కేటాయిస్తున్నట్టుగా తెలుస్తోంది.అయితే ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల వరకు లేట్ అవుతుంది అంటూ కొన్ని వార్తలైతే వచ్చాయి.
కానీ సంక్రాంతి తర్వాత నుంచి ఈ సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఇప్పటి వరకు మహేష్ బాబు ( Mahesh Babu )ను మినహాయిస్తే మిగిలిన ఏ కాస్ట్ అండ్ క్రూ ని కూడా తను రివిల్ చేయలేదు.

ఇక సంక్రాంతి రోజు కాస్ట్ అండ్ క్రూ తో పాటు ఈ సినిమాకు సంబంధించిన ఒక వీడియోను కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.మరి రాజమౌళి ఏం చేసినా చాలా పకడ్బందీగా చేస్తాడు.కాబట్టి ఆర్టిస్టులను కూడా చాలా మంచి వాళ్ళని పిక్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది.ఇండియాలో ఉన్న ఫేమస్ ఆర్టిస్టులందరూ ఈ సినిమాలో ఉండబోతున్నారట.ముఖ్యంగా బాలీవుడ్ ఆర్టిస్టులు ఎక్కువగా ఈ సినిమాలో నటించడానికి ఆస్కారం ఉన్నట్టుగా తెలుస్తుంది…
.