మహిళ రక్షణయే ధ్యేయంగా జిల్లా పోలీస్ శాఖ మరో ముందడుగు..

జిల్లా షీ టీం ఆధ్వర్యంలో ప్రతి పోలీస్ స్టేషన్లో పోలీస్ అక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జిల్లా ఎస్పీ.ప్రతి పోలీస్ స్టేషన్లో “పోలీస్ అక్క” పేరుతో మహిళ కానిస్టేబుల్ ఎంపిక.

 The District Police Department Is Another Step Forward With The Aim Of Protectin-TeluguStop.com

షీ టీంతో కలసి పని చేస్తూ పొక్సో యాక్ట్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్,ఈవ్ తీసింగ్,మహిళ చట్టాలపై ఆవాహన కల్పించనున్న పోలీస్ అక్క రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంగళవారం రోజున సిరిసిల్ల పట్టణ పరిధిలోని పద్మనాయక కల్యాణ మండపంలో జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో ఏర్పటు చేసిన “పోలీస్ అక్కా” ( Police Sister )కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో మహిళా రక్షణకు ప్రథమ బాధ్యతగా తీసుకుంటూ మహిళ రక్షణయే ధ్యేయంగా జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో విన్నూత కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అందులో భాగంగానే “పోలీస్ అక్క” పేరుతో జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళ కానిస్టేబుల్ ఎంపిక చేయడం జరిగిందన్నారు.ఈ పోలీస్ అక్కగా ఎన్నిక కాబడిన వారు షీ టీమ్ కి సహాయకంగా ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని అన్ని పాఠశాలలు, కళాశాలలను సందర్శిస్తూ విద్యార్థులకు పొక్సో యాక్ట్, సెక్సువల్ హార్స్మెంట్, ఈవ్ టీసింగ్,గుడ్ టచ్ బ్యాడ్ టచ్, మహిళ చట్టాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో పాటుగా విద్యార్థులకు సమస్యలు ఎదురైనప్పుడు వారు సంప్రదించే విధంగా షీ టీమ్, డయల్ 100, పోలీస్ అక్క నంబర్లు ఆయా పాఠశాలల్లో, కళాశాలల్లో ఏర్పాటు చేయాలన్నారు.

విద్యార్థిని విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని,సోషల్ మీడియాలో వేదికగా విద్యార్థినుల పట్ల వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు.మహిళలు, విద్యార్థినులు వేధింపులకు గురైతే నిర్భయంగా జిల్లా షీ టీమ్ నెంబర్ 8712656425 కు పిర్యాదు చేసినచో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు.

జిల్లాలో ఆకతాయిల అటకట్టిస్తూ సత్పలితలు సాధిస్తున్న జిల్లా షీ టీమ్.జిల్లాలో ఏర్పాటు చేసిన షీ టీం విద్యార్థులమహిళల సమస్యలపై వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తూ ఈ సంవత్సరం 52 మంది ఆకతాయిలను రెండ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగిందని,ఈ సంవత్సరం మహిళలను,విద్యార్థులను వేధిస్తున్న వారిపై 60 పెట్టి కేసులు,44 FIR లు నమోదు చేయడం జరిగిందన్నారు

పోలీస్ అక్కగా ఎన్నిక కాబడిన వారు పోలీస్ స్టేషన్ల వారిగా.1సిరిసిల్ల టౌన్ .కే సరస్వతి 2 తంగళ్లపల్లి .ఎస్ సుజాత .3 ముస్తాబాద్ .జె మంజుల .4.ఇల్లంతకుంట .ఎమ్ .ప్రవళిక .5.ఎల్లారెడ్డిపేట .బి రోజా .6.గంభీరావుపేట .బి శిరీష .7 .వీర్నపల్లి .కే స్వప్న .8.వేములవాడ టౌన్ .లత 9.వేములవాడ రూరల్ .ఎన్.రేణుక .10.బోయినపల్లి .పింకల్ ఏ .యాదవ్ .11 చందుర్తి .ఎచ్ .శ్రీవెన్నెల 12.కోనరావుపేట .సంధ్య 13 .రుద్రంగి .జి .అమల .నియమించారు.

ఈ కార్యక్రమంలో డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ కృష్ణ, ట్రెని ఎస్.ఐ వీనిత, షీ టీం ఏ.ఎస్.ఐ ప్రమీల, షీ టీమ్ సిబ్బంది, పోలీస్ అక్కగా ఎన్నిక కాబడిన మహిళ కానిస్టేబుల్ , విద్యార్థులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube