తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాటలు మాంత్రికుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్…( Trivikram Srinivas ) మొదట్లో రైటర్ గా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న ఆయన ఆ తర్వాత దర్శకుడిగా మారి వరుససినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకున్నాడు.ఇక ఎప్పుడైతే ఆయన ఒక సినిమా చేస్తున్నాను అని అనౌన్స్ చేస్తాడో అప్పటినుంచి ప్రేక్షకుల్లో విపరీతమైన హైప్ అయితే క్రియేట్ అవుతూ ఉంటుంది…ఇక ఈయన అల్లు అర్జున్ తో( Allu Arjun ) చేసిన మూడు సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించాయి.
అలా వైకుంఠపురంలో సినిమాతో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ ను కూడా నమోదు చేసుకున్నాడు.మరి ఇలాంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబుతో చేసిన గుంటూరు కారం సినిమాని మాత్రం సక్సెస్ ఫుల్ గా నిలపలేకపోయాడు.
ఇక కారణం ఏదైనా కూడా ఈ సినిమా రొటీన్ రొట్ట ఫార్ములాలో సాగుతుంది అంటూ ప్రేక్షకుల నుంచి కామెంట్లు రావడంతో సినిమా ప్లాప్ గా మిగిలింది.

మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాని సక్సెస్ ఫుల్ గా నిలపడంలో త్రివిక్రమ్ అయితే ఫెయిల్ అయ్యాడు.ఇక ఇప్పుడు అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోతో మరోసారి జత కట్టడానికి రెడీ అవుతున్నాడు.ఇక ఇప్పటికే వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ సక్సెస్ లను సాధించడంతో ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలైతే పెరుగుతున్నాయి.
ఇక వీళ్ళ సినిమాని తొందరలోనే స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరిని( Meenaakshi Chaudhary ) తీసుకోవాలనే ఉద్దేశ్యంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నట్టుగా తెలుస్తోంది.

మరి అల్లు అర్జున్ కూడా ఈ విషయం మీద త్రివిక్రమ్ కి పూర్తి బాధ్యతను అప్పగించినట్లుగా తెలుస్తోంది.దాంతో ఆయన మీనాక్షి చౌదరిని మెయిన్ హీరోయిన్ గా తీసుకోవాలని చూస్తున్నాడు.అయితే ఈ సినిమాలో కూడా ఇద్దరు హీరోయిన్లు ఉండబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.
మరి రెండోవ హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటున్నారు అనే దానిమీద సరైన క్లారిటీ అయితే లేదు.
ఇక రీసెంట్ గా వచ్చిన ‘లక్కీ భాస్కర్’( Lucky Bhaskar ) సినిమాలో మీనాక్షి చౌదరి నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది.తద్వారా ఆమెకు తెలుగులోనే కాకుండా మలయాళం, తమిళ్ సినిమా ఇండస్ట్రీలో కూడా మంచి మార్కెట్ అయితే ఉంది.
కాబట్టి తను కూడా ఈ సినిమాకి మార్కెట్ పరంగా చాలా వరకు హెల్ప్ అవుతుందనే ఉద్దేశ్యంతోనే త్రివిక్రమ్ తనను ప్రిఫర్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది… మొదటి హీరోయిన్ గా ఈమెను తీసుకుంటే మరి రెండో హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటారు అనేది తెలియాల్సి ఉంది…
.