వైరల్ వీడియో: ఏనుగుకు తిక్క రేగితే ఇలాగే ఉంటుంది మరి

ప్రస్తుత రోజులలో ప్రతి ఒక్కరూ కూడా సోషల్ మీడియా( Social media ) వినియోగం సర్వ సాధారణం అయిపోయింది.ఈ క్రమంలో ప్రపంచాన్ని ఏ మూలన ఏమి జరిగినా గాని అందరికీ ఇట్టే తెలిసిపోతుంది.

 This Is What Happens When A Viral Video Hits An Elephant, Track , Radio, Collar-TeluguStop.com

ఈ క్రమంలో జంతువులకు, పక్షులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి.ఒక్కోసారి జంతువులు ప్రజలను ఇబ్బంది పెట్టే వీడియోలు అందరినీ భయాందోళనకు గురి చేస్తూ ఉంటాయి.

తాజాగా ఇలాంటిదే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ చక్కర్లు కొడుతుంది.

ఏనుగు( elephant ) కోపం వచ్చినప్పుడు జనాన్ని ఎలా ఇబ్బంది పెడుతుందో అని చూపడానికి ఇదే నిదర్శనం కాబోలు.సాధారణంగా మనం ప్రశాంతంగా కనిపించే ఏనుగులు మనుషులకు సహాయం చేయడం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటాం.అదే ఏనుగు కోపానికి వస్తే జనాన్ని ఎట్లా ఇబ్బంది పెడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

పెద్దపెద్ద చెట్లను, ఇళ్లను కూడా ధ్వంసం చేసే సామర్థ్యం ఉంటాయి.అచ్చం అలాగే ఒకటి ఏనుగును కొందరు పర్యటకులు బాగా రెచ్చగొట్టారు.దీంతో చివరకు ఏనుగుకు కోపం వచ్చి వారికి ముప్పు తిప్పలు పెట్టింది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు లోకి వెళ్తే.

వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా అడవిలో రైడ్ కి వెళ్లిన కొంతమంది పర్యటకులు జంతువులను చూసి చాలా సరదాగా గడుపుతూ ఉన్నారు.ఈ క్రమంలో వారికి దూరంగా ఒక ఏనుగు కనిపించంది.దీంతో వారు వాహనాన్ని ఆపి కిందకు దిగి మరి ఏనుగును చూస్తూ ఉన్నారు.అంతేకాకుండా, ఈలలు కేకలు వేస్తూ ఏనుగును బాగా రెచ్చగొట్టారు దీంతో ఆ ఏనుగుకి కోపం వచ్చి రోడ్డుపై పరిగెత్తుకుంటూ వచ్చింది.

దీంతో అక్కడ ఉన్నవారు అందరూ పరుగు పరుగున వెళ్లి వాహనంపైకి ఎక్కేశారు.రోడ్డుపైకి వచ్చిన ఏనుగు వారిని చూసి వెంబడించడం మనం వీడియోలో చూడవచ్చు.దీంతో వారు వెంటనే వాహనాన్ని ఆన్ చేసి రివర్స్ లో ఫాస్ట్ గా వెళ్లిపోయారు.అలా కాసేపు వరకు ఆ వాహనాన్ని వెంబడించింది ఏనుగు.

అనంతరం మనసు మార్చుకొని ఆ ఏనుగు వెనక్కు వెళ్లిపోయింది.దీంతో వారందరూ కూడా హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు.ఇక ఈ వీడియోని చూసిన కొంతమంది నెటిజెన్స్ వివిధ రకాలుగా స్పందిస్తూ.“ఏనుగుకు కోపం వస్తే ఇలానే ఉంటుంది కాబోలు” అని కామెంట్ చేస్తూ ఉంటే, మరికొందరు ఇలాంటి వారికి తగిన బుద్ధి ఏనుగు బాగానే చెప్పిందని కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube